మరో భారీ స్కాంలో వైసీపీ?

admin
Published by Admin — February 27, 2026 in Politics
News Image
వైసీపీ(ycp) హ‌యాంలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల‌పై కొర‌డా ఝ‌ళిపిస్తున్న ప్ర‌స్తుత కూట‌మి సర్కారు.. ఇప్ప‌టి కే మ‌ద్యం అక్ర‌మాల‌పై కేసులు న‌మోదు చేసింది. ఈ క్ర‌మంలోనే ప‌లువురిని అరెస్టు కూడా చేసింది. ఇక‌, ప్ర‌స్తుతం తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ప్ర‌సాదం ల‌డ్డూ(laddu)లో క‌ల్తీనెయ్యి(adulterated ghee) వ్య‌వ‌హారం కూడా.. వైసిపీకి ఉచ్చుగా మార‌నుంది. ఇప్ప‌టికే ఆ పార్టీ నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. అదేస‌మ‌యంలో నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పైనా కేసులు న‌మోదవుతున్నాయి.
 
ఈ ప‌రంప‌రలో అతి పెద్ద కేసు ఇప్పుడు వైసీపీ మెడ‌కు చుట్టుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదే జ‌గ‌న‌న్న ఇళ్లలో(jagananna houses) జ‌రిగిన అవినీతి. దీనిపై ప్ర‌భుత్వం తాజాగా దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల నుంచి వ‌స్తున్న అభ్య‌ర్థ‌న‌లు.. స‌హా.. ల‌బ్ధిదారుల నుంచి కూడా.. వ‌స్తున్న ఫిర్యాదుల నేప‌థ్యంలో జ‌గన న్న ఇళ్ల కాల‌నీల విష‌యంలో జ‌రిగిన అవినీతిపై విచార‌ణ చేయించాల‌ని ప్ర‌బుత్వం దాదాపు ఒక నిర్ణ‌యా నికి వ‌చ్చిన‌ట్టు మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ చెప్పారు.
 
7 వేల కోట్ల అవినీతి..
జ‌గ‌న‌న్న ఇళ్ల కాల‌నీల పేరుతో వైసీపీ నాయ‌కులు ఏకంగా క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో 7 వేల కోట్ల(7 thousand crores) అవినీతి (scam)పాల్ప‌డ్డార‌ని ప్రాథ‌మికంగా ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది జ‌గ‌న‌న్న ఇళ్ల కాల‌నీల కోసం.. రైతుల‌ నుంచి తక్కువ ధరకు భూములు కొని.. అంతకు రెండు, మూడు రెట్ల ఎక్కువ ధరకు ప్రభుత్వానికి విక్రయించారని ప్ర‌భుత్వానికి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. దీనిపై అంత‌ర్గ‌త విచార‌ణ కూడా చేయించిన ప్ర‌భుత్వం.. దీనిని నిర్ధారించుకుంద‌ని మంత్రి చెబుతున్నారు.
 
ముఖ్యంగా నాటి జ‌గ‌న్(jagan) ప్ర‌భుత్వం ఇళ్ల నిర్మాణం కోసం.. 10,414 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించింది. అయితే.. దీనిలో స‌గానికిపైగానే.. సొమ్ము ఎమ్మెల్యేల చేతుల్లోకి చేరింద‌ని.. ల‌బ్ధిదారుల‌కు ఇంకా ఇళ్లు క‌ట్టి ఇవ్వ‌క‌పోవ‌డానికి ఈ అవినీతే కార‌ణ‌మ‌నికూట‌మి ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది. ఇళ్ల స్థలాల మంజూరులో అవకతవకలు జరిగాయ‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది. ఇళ్ల కోసం అప్ప‌ట్లో 31,35,320 దరఖాస్తులు రాగా, 22,80,358 మందికి స్థలాలు ఇచ్చారు. వారిలో మిగిలిన 7 లక్షలకుపైగా స్థలాలు వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ సొంత వారికి కట్టబెట్టారు. ఆయా అంశాల‌పై విచార‌ణ జ‌రిగింద‌ని.. కేసులు న‌మోదు చేస్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.
Tags
ycp scam jagananna colonies jagananna houses
Recent Comments
Leave a Comment

Related News