అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్(trump) నోటి మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మాట పడితే అంత మాట అలవోకగా మాట్లాడే అతను.. అవసరమైతే తన మాటల్నివెనక్కి తీసుకుంటూ గందరగోళానికి గురి చేస్తుంటాడు. ఎంత సేపటికి తాను ఎంత గొప్పవాణ్ని అన్న విషయాన్ని చాటి చెప్పుకునేందుకు తహతహలాడే ధోరణి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా పాక్ ప్రధాని జర్దార (pakistan president zardari) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కానీ లేకుంటే పాక్ ప్రధాని(pakistan president) చచ్చిపోయేవాడన్న(died) మాటను చెప్పటం అందరిని షాక్ కు గురి చేసింది.
ఒక దేశ ప్రధాని గురించి ఇంత చులకనగా మాట్లాడటం గమనార్హం. అయితే.. ట్రంప్ నోరు జారారని.. ఆయన చెప్పాలనుకున్నది ఒకటైతే.. చెప్పింది మరోకటన్న మాట వినిపిస్తోంది. తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది యుద్ధాల్ని ఆపినట్లుగా పేర్కొన్న ట్రంప్.. భారత్ - పాక్ మధ్య అణు యుద్ధం జరగేదన్న వ్యాఖ్య చేస్తూ.. తాను కానీ కల్పించుకోకుంటే పాక్ ప్రధాని చచ్చిపోయి ఉండేవాడంటూ నోరుజారారు.
అయితే.. ట్రంప్ నోటి నుంచి రావాల్సిన మాటకు భిన్నంగా పాక్ ప్రధాని ప్రస్తావన వచ్చిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారత్ - పాక్ యుద్దమే జరిగి ఉంటే 3.5 కోట్ల మంది జనాభా చనిపోయి ఉండేవారన్న మాటను చెప్పే క్రమంలో.. తాను జోక్యం చేసుకొని ఉండకపోతే పాక్ ప్రధాని చచ్చేవాడని 3.5 కోట్ల మంది చెప్పినట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి తన నోటిని ఇష్టారాజ్యంగా వాడేసే ట్రంప్.. తాజాగా పాక్ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు ఆ దేశం ఎలా రియాక్టు అవుతుందన్నది చూడాలి. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ట్రంప్ నోటి నుంచి వచ్చిన తాజా మాట ఇప్పుడు సంచలనంగా మారింది. కొత్త ప్రశ్నలకు తావిచ్చేలా చేసిందని చెప్పాలి.