టాలీవుడ్ లో పెళ్లి కాని ప్ర‌సాద్‌లు.. ఈ హీరోల ఏజ్ తెలిస్తే షాకే!

admin
Published by Admin — February 27, 2026 in Movies
News Image

టాలీవుడ్‌లో వరుస పెళ్లిళ్లు సందడి చేస్తున్నాయి. ఇటీవ‌లె రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను పెళ్లాడి ఒక ఇంటివాడయ్యాడు. అటు మెగా కాంపౌండ్ నుంచి అల్లు శిరీష్ కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇలా వరుసగా యంగ్ హీరోలంతా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుండటంతో, ఇప్పుడు అందరి కళ్లు టాలీవుడ్‌లో మిగిలి ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ పై పడ్డాయి. మరి ఇప్పటికీ సింగిల్ స్టేటస్‌తోనే కొనసాగుతున్న మన టాలీవుడ్ స్టార్స్ ఎవరు? వారి ప్రస్తుత వయసు ఎంతో..? తెలుసుకుందాం ప‌దండి.

ప్రభాస్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో లిస్ట్ లో మొద‌ట వినిపించే పేరు ప్రభాస్. వయసు 46 ఏళ్లు దాటుతున్నా, ఇప్పటికీ పెళ్లి ఊసెత్తకుండా వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. సోలో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ డార్లింగ్ ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారో అని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
 
అడివి శేష్: టాలీవుడ్ `మేజర్` కూడా 40 ఏళ్ల మార్కును దాటేశారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. అయితే గ‌త కొంత కాలంగా ఒక ప్రముఖ వ్యాపారవేత్త కూతురితో శేష్ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నా, ఇంకా క్లారిటీ రాలేదు.

రామ్ పోతినేని: తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపు పొందిన‌ రామ్ పోతినేని వయసు 37 ఏళ్లు. అందం, అభినయం ఉన్నా రామ్ ఇంకా పెళ్లి పీటలెక్కకపోవడం ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రామ్ పెళ్లి గురించి గత కొన్నేళ్లుగా రకరకాల వార్త‌లు వస్తున్నా.. అవి చివ‌ర‌కు పుకార్లుగానే మిగిలిపోతున్నాయి.

సాయి దుర్గ తేజ్: ``సోలో బ్రతుకే సో బెటర్`` అంటూ సినిమాలు చేసిన ఈ మెగా మేనల్లుడు కూడా 39 ఏళ్లు వ‌చ్చినా ఇంకా బ్యాచిలర్ గానే కొనసాగుతున్నారు. అయితే గ‌త ఏడాది తిరుమ‌ల‌లో ఓ విలేక‌రి పెళ్లి గురించి ప్ర‌శ్నించగా.. 2026లో త‌ప్పకుండా చేసుకుంటాన‌ని స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం గ‌మనార్హం.

సందీప్ కిషన్: విభిన్నమైన కథలతో బిజీగా ఉండే సందీప్ కిషన్(38) కూడా పెళ్లి ఊసెత్తకుండా కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఈయ‌న్ను పెళ్లి గురించి అడిగితే ఏదో ఒక సమాధానం చెప్పి దాటవేస్తున్నాడు కానీ, అసలు మ్యాటర్ ఏంటో మాత్రం బయటపెట్టడం లేదు.

బెల్లంకొండ శ్రీనివాస్: మాస్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న ఈ యంగ్ హీరో వ‌య‌సు 33 ఏళ్లు. ప్రస్తుతానికి కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టిన బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఎప్పుడెప్పుడు సింగిల్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ పెళ్లితో టాలీవుడ్‌లో ఒక పెద్ద గ్యాప్ ఏర్పడింది. మరి ఈ పెళ్లి కాని ప్రసాద్‌లలో ఎవరు ముందుగా బ్యాచిలర్ స్టేటస్‌ను వదిలించుకుంటారో చూడాలి. 

Tags
Tollywood Tollywood Bachelors Tollywood Weddings Virosh Wedding Prabhas Marriage Most Eligible Bachelors
Recent Comments
Leave a Comment

Related News