సచిన్ కుమారుడి వివాహ వేడుకలో మంత్రి లోకేష్, బ్రాహ్మణి దంపతులు

admin
Published by Admin — March 05, 2026 in National
News Image

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు హాజరయ్యారు. ఈ ఉదయం ముంబయి చేరుకున్న మంత్రి లోకేష్ దంపతులు అక్కడ సెయింట్ రెజిస్ హోటల్ లో జరిగిన సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు.

సచిన్ టెండూల్కర్ కుటుంబం మంత్రి లోకేష్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ లను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తరలివచ్చారు.

News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
Arjun Tendulkar's wedding sachin tendulkar nara lokesh brahmani attended
Recent Comments
Leave a Comment

Related News