సెలబ్రెటీ జంటలు బయటికి వస్తే.. అందరి చూపూ వారి మీద ఉంటుంది. వారి ఆహార్యం దగ్గర్నుంచి హావభావాల వరకు ప్రతిదీ నిశితంగా గమనిస్తారు జనం. ఏదైనా తేడాగా ఉంటే సోషల్ మీడియాలో గుసగుసలు మొదలైపోతాయి. ఇటీవల రెండు సెలబ్రెటీ పెళ్లి వేడుకల్లో రెండు జంటల కెమిస్ట్రీ.. అనేక సందేహాలకు తావిచ్చింది. అందులో ఒక జంట టాలీవుడ్‌కు చెందినది కాగా.. మరో పెయిర్ బాలీవుడ్‌ది.
టాలీవుడ్లో గొప్ప పేరున్న దగ్గుబాటి కుటుంబానికి చెందిన రానా(rana daggubati).. కొన్నేళ్ల ముందు మిహిక బజాజ్‌ను(mihika bajaj) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఎప్పుడూ మంచి జోష్‌తో కనిపిస్తుంటుంది. కానీ తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వెడ్డింగ్ రిసెప్షన్లో మాత్రం ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఒకప్పట్లా లేదు. ఇద్దరూ కొంచెం అన్యమనస్కంగా(gap) కనిపించారు. స్టేజ్ మీదికి మిహికను పిలుస్తూ.. రానా చేయి అందిస్తే ఆమె చేయి అందుకోలేదు.
ఫొటోలకు పోజులు ఇచ్చేటపుడు ఇద్దరూ ముభావంగానే కనిపించారు. చివర్లో ఒకరితో ఒకరు మాట్లాడుకున్న తీరు కూడా సందేహాలకు తావిచ్చింది. మామూలుగా రానా ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పండుతాయి. అతను నవ్వుతూ అందరినీ నవ్విస్తుంటాడు. కానీ ఈ వేడుకలో మాత్రం భిన్నంగా కనిపించాడు. దీంతో రానా, మిహికల మధ్య ఏం జరుగుతోంది అనే చర్చలు మొదలైపోయాయి సోషల్ మీడియాలో.
ఇక బాలీవుడ్లో మోస్ట్ సెలబ్రేటెట్ కపుల్ అనదగ్గ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్‌ల మధ్య సంబంధాల గురించి కొన్నేళ్ల నుంచి అనేక రూమర్లు వచ్చాయి. ఇద్దరూ విడిపోతున్నట్లుగా మీడియా కోడై కూసింది. కానీ ఇద్దరూ వివాహ బంధంలో కలిసే సాగుతున్నారు. ఐతే విడాకుల వరకు వెళ్లలేదు కానీ.. కలిసి ఉండట్లేదనే అనుమానాలున్నాయి. తాజాగా సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ పెళ్లికి ఇద్దరూ కలిసే వచ్చారు కానీ.. అది మొక్కుబడి వ్యవహారంలాగే అనిపించింది.
ఇద్దరి మధ్య సాన్నిహిత్యమే లేకపోయింది. చాలా ముభావంగా ఉన్నారు. ముఖ్యంగా ఐశ్వర్య అయితే అభిషేక్‌తో కలిసి ఫొటోలకు పోజులు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడ్డట్లు కనిపించింది. దీంతో ఈ జంట బంధం మీద కూడా సోషల్ మీడియా చర్చించుకుంటోంది.