ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) మరియు భారత రాయబార కార్యాలయం, శాన్ ఫ్రాన్సిస్కో (Consulate General of India, San Francisco) సంయుక్తంగా "నారీ 2026 – అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు" ఘనంగా నిర్వహించాయి. ఇండో అమెరికన్ సమాజంలోని అసాధారణ నాయకత్వాన్ని, సేవా భావనను కనబరిచిన మహిళలను ఘనంగా సత్కరించారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకకు పలువురు అతిథులు, అవార్డు గ్రహీతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
నెట్‌వర్కింగ్, స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల నాయకత్వాన్ని గుర్తించే అవార్డులతో ఈ కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. మహిళా నాయకత్వం, సేవ, సాధికారతపై వక్తలు తమ సందేశాలు అందించారు.
విభిన్న సాంస్కృతిక నేపథ్యాలున్న మహిళలను ఒక చోట చేర్చే ఈవెంట్‌లు అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేస్తాయని కాలిఫోర్నియా లెఫ్టినెంట్ గవర్నర్ ఎలెని కౌనాలకిస్ అన్నారు. ఇండో-అమెరికన్ మహిళల ప్రభావం కాలిఫోర్నియా ఉద్యోగ, నాయకత్వ రంగాల్లో పెరుగుతోందని చెప్పారు.
తన కార్యాలయం ఈ మహిళా నాయకుల సత్కార కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో డాక్టర్ శ్రీకర్ రెడ్డి అన్నారు. సమాజాన్ని ఏకం చేసేందుకు ఏఐఏ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. భారతదేశంలో మహిళల సాధికారత పురోగతి, స్థానిక పాలనలో పెరిగిన ప్రాతినిధ్యం, నారీ శక్తి వందన్ చట్టం గురించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకర్ రెడ్డి సతీమణి ప్రతిమా రెడ్డి, మాజీ యుఎస్ అంబాసిడర్ షెఫాలి రజ్దాన్ దుగ్గల్, CK-12 ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు నీరు ఖోస్లా, అసెంబ్లీ మెంబర్ క్యాథరిన్ స్టెఫాని, శాన్ ఫ్రాన్సిస్కో చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ పెనీ కౌల్టర్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ క్రిస్టీన్ పెలోసి తదితరులు కూడా ప్రసంగించారు.
సమాజంలో వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి రాణించిన 48 మంది మహిళా నాయకులను "ట్రైల్ బ్లేజర్ ఉమన్ అవార్డ్స్"తో సత్కరించారు. పబ్లిక్ సర్వీస్, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎడ్యుకేషన్, కమ్యూనిటీ లీడర్‌షిప్ రంగాల నుంచి ఆ 48 మందిని ఎంపిక చేశారు. ఎలెని కౌనాలకిస్,
షెఫాలి రజ్దాన్ దుగ్గల్, నీరు ఖోస్లాలకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్ ప్రదానం చేశారు.
CA శ్రీమా రంగనాథన్ (CPA, CA, MBA, మాజీ చైర్‌పర్సన్, ICAI డల్లాస్/DFW చాప్టర్)కు గీతా రామకృష్ణన్ మెమోరియల్ అవార్డును అందజేశారు. ICAI మాజీ చైర్‌పర్సన్ గీతా రామకృష్ణన్ ఆశయాల స్మరించుకుంటూ ఆమె పేరిట ఈ అవార్డు అందజేశారు.
48 మంది అవార్డు గ్రహీతల జాబితా:
ప్రతిమా రెడ్డి కొప్పుల, ఎలెని కౌనాలకిస్, షెఫాలి రజ్దాన్ దుగ్గల్, నీరు ఖోస్లా, క్యాథరిన్ స్టెఫాని, పెనీ కౌల్టర్, క్రిస్టీన్ పెలోసి, CA. శ్రీమా రంగనాథన్, సోనితా లొంటోహ్, లిలీ మెయ్, షెర్రీ హు, అనితా మాన్వాణి, నోరీన్ కింగ్, హన్నా కైన్, మమతా భండారి, డాక్టర్ నిలిమా రాఘవన్, బీనా అమ్మనాథ్, వాసు జక్కల్, షాలిని గోవిల్-పై, సుందరి మిత్రా, సులతా మిత్రా సర్కార్, సుమితా జయరామన్, షబానా షిరాజ్, సేమా శర్మ, అమృతా కార్, లీలా మాథూర్, ప్రియా కన్నన్, మీనా శివరామకృష్ణన్, పద్మ పార్థసారథి, శుభా పృథ్విరాజ్, రీమా ముఖర్జీ, లిజీ జాన్, రేణి పౌలోస్, లక్ష్మీ షైజు, రిను నాయర్, నమ్రతా యుహన్నా, శంపీ ప్రకాష్, రేణు భట్, సుధా ప్రభునందన్, షీటల్ ఝారియా, గాయత్రి జోషి, అర్చనా పాండా, రేణుక చవ్వా, రాధికా శర్మ, జ్యోతి చిగుళ్లపల్లి, మినల్ జోషి, మేఘ్నా పటేల్, రియా పటేల్ లు అవార్డులు అందుకున్నారు.
నెట్‌వర్కింగ్ సెషన్‌తో ప్రారంభమైన ఈ వేడుకతే సాంస్కృతిక ప్రదర్శనలు, రాగాలతో మెరిశాయి. అవార్డు గ్రహీతలు తమ జీవిత అనుభవాలు, పాఠాల గురించి పంచుకున్న ప్రేరణాత్మక కథలు ఆకట్టుకున్నాయి. సిలికాన్ వ్యాలీ నుంచి టెక్, బిజినెస్, కమ్యూనిటీ రంగాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి, ప్రతిమా రెడ్డి, కాన్సులేట్ సిబ్బందికి AIA బృందం ధన్యవాదాలు తెలిపింది. M.R. రంగస్వామి (ఇండియాస్పోరా), అనితా మాన్వాణి (TiE సిలికాన్ వ్యాలీ)లకు కృతజ్ఞతలు చెప్పింది.
సమాజంలో మహిళల విజయాలను గుర్తించడం, సమానత్వం, నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు "నారీ" వేడుకలు ముఖ్యమైన వేదికగా నిలుస్తున్నాయి. సిలికాన్ వ్యాలీలో 50కి పైగా నాన్-ప్రాఫిట్ సంస్థల కూటమి AIA. సమాజ సేవ, సాంస్కృతిక ఐక్యత, పౌర భాగస్వామ్యాన్ని ఏఐఏ ప్రోత్సహిస్తుంది. ‘‘నారీ’’ వంటి కార్యక్రమాలు భావి తరాల మహిళలు అడ్డంకులను ఛేదించి, తమ ఆశయాలను సాధించేందుకు ప్రేరణనిస్తాయి. ఈ వేడుక సమాజంలో మహిళల శక్తిని, సహకారాన్ని మరింత బలోపేతం చేసింది.