కూట‌మి ప్ర‌భుత్వంలో పంచాయ‌తీల‌కు స్వ‌ర్ణ‌యుగ‌మేనా..?

admin
Published by Admin — March 23, 2026 in Politics, Andhra
News Image

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక పంచాయ‌తీల‌కు  స్వ‌ర్ణ‌యుగం ప్రారంభ‌మైంది. నిధులు.. విధులు.. అభివృద్ధి నినాదంతో పంచాయ‌తీలు నేడు ముందుకు సాగుతున్నాయి. ఒక‌ప్పుడు.. పంచాయ‌తీలకు ఏ చిన్న అవ‌స‌రం వచ్చినా.. ప్ర‌భుత్వం ద‌య కోసం.. వారు వేసే భిక్ష కోసం ఎదురు చూడాల్సి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. కొంద‌రు పంచాయ‌తీ ప్రెసిడెంట్లు.. భిక్షాట‌న చేసిన ప‌రిస్థితి కూడా మ‌నకు తెలిసిందే. అలాంటి ప‌రిస్థితిని కూట‌మి ప్ర‌భుత్వం మార్చింద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. గ‌తంలో కేంద్రం నుంచి నిధులు వ‌స్తే.. విద్యుత్ చార్జీల‌ని.. ఇత‌ర‌త్రా బ‌కాయిలు అని ప్ర‌భుత్వం మిన‌హాయిం చుకున్న ప‌రిస్థితి కూడా మ‌న‌కు తెలిసిందే. క‌నీసం ఒక పంచాయ‌తీ ఉంటుంది.. దానిలో స‌భ్యులు ఉంటారు.. వారు తీర్మానం చేయాల‌న్న స్పృహ కూడా లేకుండా.. సొమ్ములు జ‌మ చేసుకుని పంచాయ‌తీల‌ను ఎండ‌బెట్టారు. త‌ద్వారా పంచాయ‌తీలు నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. 

కూట‌మి ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి  ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. పంచాయ తీల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప‌ల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంద‌న్న మ‌హాత్మా గాంధీ స్ఫూర్తితో గౌర‌వ ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారు.. పంచాయ‌తీల అభివృద్ధికి పూనుకొన్నారు. కేంద్రం నుంచి వ‌స్తున్న నిధుల‌ను నేరుగా మ‌న ఖాతాల‌కే జ‌మ చేస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇవ్వాల్సిన వాటాల‌ను కూడా పంచాయ‌తీల‌కు కేటాయిస్తూ.. స‌మ‌యానికి అనుగుణంగా నిధుల‌కు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు.  ఒక‌ప్పుడు పంచాయ‌తీ స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్ ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ.. వైసీపీ హ‌యాంలో ఈ ప‌వ‌ర్‌ను  తీసేశారు. కానీ.. ఇప్పుడు మ‌ళ్లీ చెక్ ప‌వ‌ర్ క‌ల్పించే దిశ‌గా గౌర‌వ డిప్యూటీ సీఎం తీసుకున్న చ‌ర్య‌లు పంచాయ‌తీ ప్రెసిడెంట్లు గౌర‌వంగా త‌లెత్తుకునేలా చేస్తున్నాయి.

ప‌ల్లె పండుగ-కార్య‌క్ర‌మం ద్వారా.. పంచాయ‌తీల‌కు మెరుగైన అభివృద్ధి ప‌నులు కేటాయిస్తున్నారు. వాటిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు.ఇది ఊహించ‌ని విధంగా పంచాయ‌తీల్లో మార్పులు వ‌చ్చేలా చేసింది. అంతేకాదు.. స్వ‌ర్ణ పంచాతీయ‌... పేరుతో చేస్తున్న మార్పులు కూడాగ్రామీణ పాల‌న‌ను మ‌రింత బాధ్య‌త‌గా చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. గ‌తంలో వైసీపీ పాల‌న ఎలా సాగిందో అంద‌రికీ తెలిసిందే. పంచాయ‌తీ నిధుల‌ను తినేశారు.. పంచాయ‌తీ పాల‌కుల‌ను రోడ్డున ప‌డేశారు. గ్రామీణ ప్ర‌జ‌లు ఓటేసి గెలిపించిన‌.. ప్ర‌జాప్ర‌తినిధుల‌కు విలువే లేకుండా చేశారు. కానీ.. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వంలో పంచాయ‌తీలు.. పంచాయ‌తీ ప్ర‌జాప్ర‌తినిధులు స‌గ‌ర్వంగా త‌లెత్తుకుని ముందుకు సాగే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Tags
AP Politics Andhra Pradesh NDA government TDP Janasena BJP
Recent Comments
Leave a Comment

Related News