రాజకీయాల గడప దాటి మళ్లీ వెండితెర గడప తొక్కారు మాజీ మంత్రి ఆర్కే రోజా(RK Roja). ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటూ గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరమైన ఆమె, ఇప్పుడు మళ్ళీ మేకప్ బాక్స్ తీశారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా కోలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో సెన్సేషన్ సృష్టిస్తున్నారు.
ఏపీ(AP) రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా వెలిగిన రోజా, ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు. అయితే ఆ గ్యాప్‌ను రాజకీయ వ్యూహాల కోసం కాకుండా, తన పాత వృత్తి అయిన సినిమా కోసం ఉపయోగిస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత ఆమె మళ్లీ తమిళ చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. శోభన వంటి సీనియర్ నటీమణులు వరుసగా రీ-ఎంట్రీ ఇస్తున్న తరుణంలో, రోజా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.
ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన చిత్రం 'అన్బే డయానా'(Anbe Diana). పారి ఎలవళగన్ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో రోజా ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇది మామూలు తల్లి పాత్ర కాదు.. పెరంబూర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథలో ఒక పవర్‌ఫుల్ మదర్ క్యారెక్టర్ అని టాక్. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా విడుదలైన ‘పెరంబూర్ గానా’ పాటలో రోజా వేసిన మాస్ స్టెప్పులు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. రాజకీయాల్లో ఉన్నా సరే, డ్యాన్స్‌లో రోజా ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కేవలం 'అన్బే డయానా' మాత్రమే కాదు, ఆమె నటించిన 'లెనిన్ పాండ్యన్' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మిలియన్ డాలర్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాలు రోజా సెకండ్ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా, అసెంబ్లీలో తన గళాన్ని వినిపించిన రోజా(Roja), ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై తన గలగలాటతో ప్రేక్షకులను ఎలా అలరిస్తారో చూడాలి.
https://twitter.com/Timelessvoice81/status/2035406474021855469