వైసీపీ అధినేత జగన్(jagan), ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల(sharmila) మధ్య మరోసారి ఆస్తుల వివాదం(property disputes) తెరమీదికి వచ్చింది. ఈ దఫా.. తన పిల్లల వ్యవహారాన్ని తెరమీదికి తెచ్చిన షర్మిల.. మేనల్లుడు, మేనకో డలుకు జగన్ అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. కన్నీరు కూడా పెట్టుకున్నారు. వైఎస్ ఆస్తుల్లో ముగ్గురు మనవరాళ్లకు, మనవడికి సమానంగా ఆస్తులు చెందాలని రాశారని పేర్కొన్నారు. కానీ.. జగన్ అన్యాయం చేశారని తెలిపారు.
ఇక, ఈ క్రమంలోనే ఇరువురి మాతృమూర్తి.. విజయమ్మ సైతం నోటరీ అఫిడవిట్‌ను విడుదల చేశారు. వాస్తవానికి బహిరంగ లేఖ రాస్తే.. సరిపోయేదానికి ఆమె నోటరీ అఫిడవిట్ రాయడం.. దీనిని అటెస్టేషన్ చేయించడం వంటివి ఆసక్తిగా మారాయి. అయితే.. ఈ మొత్తం వ్యవహారం వెనుక.. జగన్ సతీమణి భారతి విషయంలో షర్మిల సందేహిస్తున్నట్టు తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు.
రేపు బలమైన సాక్షాలు లేకపోతే.. తనకు, తన పిల్లలకు అన్యాయం జరుగుతుందని.. ఈ విషయంలో జగన్ కంటే కూడా భారతి తమకు ప్రమాదకారిగా మారుతుందని షర్మిల అంచనా వేస్తున్నట్టు కనిపిస్తోంద ని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా విజయమ్మ ఏకంగా బహిరంగ లేఖ కాకుండా.. నోటరీ అఫిడవిట్‌ను విడుదల చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. తద్వారా.. న్యాయపరంగా భవిష్యత్తు లో చిక్కులు రాకుండా చూసేందుకు కూడా వీలుంటుందని అంటున్నారు.
భారతి ప్రభావం ఎంత..?
ఆస్తుల వివాదాల్లోభారతి ప్రభావం ఎంత? అనేది గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న చర్చ. ఎందు కంటే.. సహజంగానే తన భర్త ఆస్తులను తను దక్కించుకునేందుకు... లేదా.. తన కుటుంబానికి దక్కేలా చేసుకునేందుకు ఏ భార్య అయినా ప్రయత్నిస్తుంది. అందుకే.. ఇప్పుడు భారతి సెంట్రిక్‌గానే షర్మిల ఆస్తుల యుద్ధాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్టు తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తును ఊహించుకునే.. ఇప్పుడు విజయమ్మతో ఓపెన్ అఫిడవిట్ ఇప్పించారని చెబుతున్నారు.