రామతీర్థం. ఈ మాటకు ఎంతో లోతైన అర్థం ఉంది. ఎంతో పవిత్రత కూడా ఉంది. కానీ.. వైసీపీ హయాంలో జరిగిన దారుణ ఘటన తర్వాత.. రామతీర్థం పేరు వినగానే మనసు ఆవేదనకు గురవుతుంది. చివుక్కుమంటుంది. ఆ దారుణాన్ని తట్టుకోవడం చాలా కష్టం`` అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(pawan kalyan) అన్నారు. విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థ(ramatheertham) క్షేత్రానికి తొలిసారి `గిరి ప్రదక్షిణ` కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు.
శ్రీరామ నవమికి రెండు రోజుల ముందు.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రామతీర్థం.. అంటే.. రాముడు స్పృచించిన నేల.. రాముడు నడయాడిన ప్రాంతమని భావిస్తున్నానని తెలిపారు. ఆ ప్రాంతానికి ఎంతో పవిత్రత ఉందన్నారు. కానీ, వైసీపీ పాలనలో రామతీర్థంలో ఎంత ఘోరం జరిగిందో అందరికీ తెలిసిందేనని చెప్పారు. నాటి ఘోరం తలుచుకుంటే మనసుకు ఎంతో బాధగా ఉంటుందని చెప్పారు. తమ ప్రభుత్వం రాగానే.. ఆలయాల్లో పవిత్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
ఈ క్రమంలోనేరామతీర్థం ఆలయాన్ని కూడా మెరుగు పరిచామని పవన్ కల్యాణ్ చెప్పారు. కాగా.. తొలిసారి రామతీర్థం ఆలయా నికి గిరి ప్రదక్షిణ మార్గాన్ని నిర్మించారు. ఇది మొత్తం 3.7 కిలో మీటర్ల దూరం. దీనిని నిర్మించేందుకు.. సుమారు 3 కోట్ల 40 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. ఈ రహదారిలో ప్రదక్షిణ చేసే యాత్రికులు కూర్చునేందుకు ప్రత్యేక సదుపాయం కల్పిం చారు. అదేవిధంగా తాగునీటికి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. మధ్య మధ్య షెల్టర్లను కూడా నిర్మించారు. ఈ రహదారి ప్రారంభోత్సవంలో పవన్ కల్యాణ్ సహా పలువురు మంత్రులు వర్చువల్‌గా పాల్గొన్నారు.
అప్పట్లో ఏం జరిగింది?
వైసీపీ(ycp) హయాంలో రామతీర్థంలో ఘోరం చోటు చేసుకుంది. 2021-22 మధ్య కాలంలో పలు ఆలయాల్లో జరిగిన ఘోరాల కంటే కూడా ఇది అత్యంత దారుణం కావడం గమనార్హం. అంతర్వేది రథం దగ్ధం జరిగిన తర్వాత.. విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో మూల విరాట్టు శ్రీరామ చంద్రమూర్తి విగ్రహం శిరస్సును దుండగులు ఛేదించారు.(తలను వేరు చేయడం) ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణకు అప్పట్లో టీడీపీ మాజీ ఎంపీ.. ప్రస్తుత గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు పట్టుబట్టారు. చంద్రబాబు కూడా పర్యటనకు వెళ్లారు. కానీ.. వైసీపీ ప్రభుత్వం వారిని అనుమతించలేదు. చివరకు జిల్లాస్థాయి పోలీసులు విచారణ చేసి.. `మతిస్థిమితం లేని వ్యక్తి` ఈ ఘటనకు పాల్పడ్డారని తేల్చారు.