ఉత్తరాంధ్ర()uttarandhra అభివృద్ధి..భవిష్యత్తు పూర్తిగా మారుతుందని సీఎం చంద్రబాబు(cm chandrababu) తెలిపారు. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర అయినప్పటికీ.. ఇక నుంచి `ఉక్కు.. ఆంధ్ర`గా ఈ ప్రాంతం వర్థిల్లుతుందన్నారు. ఆర్సెల్లార్ మిట్టల్ నేతృత్వంలో భారీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కేంద్ర ప్రభుత్వ సహకారం.. రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో నిర్మాణం పూర్తి చేసుకోనుందని తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద ఉక్కుఫ్యాక్టరీగా ఇది అవతరించనుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా ఏకంగా లక్ష మందికి పైగా ఉద్యోగ, ఉపాధులు లభించనున్నాయి. దీనికి సంబంధించి తాజాగా సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. ఉత్తరాంధ్రకు ఇది గేమ్ ఛేంజర్‌గా మారనుందన్నారు. కేంద్రం సహకారంతో ఈ ఫ్యాక్టరీని ఏపీకి తీసుకువచ్చామని.. ప్రధాని మోడీ సహకారం మరువలే మని చెప్పారు. ఈ కంపెనీ తాలూకు ఫలాలు మూడు సంవత్సరాల్లోనే ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా.. దేశ ప్రజలకు కూడా అందుతాయని ఉద్ఘాటించారు.
ఆర్సెల్లార్ మిట్టల్ కంపెనీ రావడం ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక వరమని వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ``గత ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్ర ప్రజలకు హామీ ఇచ్చాం. దీనిని నెరవేర్చాం.`` అని తెలిపారు. మార్పు తీసుకువస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. ఒక్క ఉత్తరాంధ్రకే `మార్పు` పరిమితం కాబోదన్న సీఎం చంద్రబాబు.. అన్ని ప్రాంతాల్లోనూ మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. స్టీల్ రంగంలో ఏపీ దేశంలోనే ఉన్నతస్థానానికి ఎదుగుతుందన్నారు.