ఉప్పెన భామ‌కు బంప‌ర్‌ ఛాన్స్

admin
Published by Admin — March 27, 2026 in Movies
News Image

తొలి సినిమా ఉప్పెన‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్నందుకుని బిజీ హీరోయిన్ అయిపోయింది క‌న్న‌డ అమ్మాయి కృతి శెట్టి(krithi shetty). టీనేజీలోనే వంద కోట్ల హీరోయిన్ కావ‌డం అరుదైన విష‌యం. ఆ సినిమా రిలీజైన‌ ఏడాదికే ఆమె చేతిలోకి మూణ్నాలుగు సినిమాలు వ‌చ్చేశాయి. రెండో సినిమా శ్యామ్ సింగ‌రాయ్ సైతం మంచి ఫ‌లితాన్నందుకుంది. 

మూడో సినిమా బంగార్రాజు సైతం ఓ మోస్త‌రుగా ఆడింది. కానీ ఆ త‌ర్వాత మాత్రం ఆమెకు క‌లిసి రాలేదు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, ది వారియ‌ర్, ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ఇలా చాలా ఫ్లాపులే ఖాతాలో వేసుకుంది కృతి. కొంచెం గ్యాప్ త‌ర్వాత మ‌న‌మే అనే సినిమాలో న‌టిస్తే అదీ నిరాశ‌ప‌రిచింది. దీంతో తెలుగులో కృతి కెరీర్ దాదాపు క్లోజ్ అయిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రోవైపు త‌మిళంలో ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసినా.. వాటి రిలీజ్ బాగా లేట్ అయిపోయింది. వాత్తియార్ వ‌రువార్ సినిమా రిలీజైనా ఫ్లాప్ కావ‌డంతో కృతి కెరీర్ అయోమ‌య స్థితికి చేరుకుంది.

ఇలా బ్యాడ్ ల‌క్ వెంటాడుతున్న స‌మ‌యంలో కృతికి అదిరిపోయే ఛాన్స్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆమె హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. ఈ సంక్రాంతికి మ‌న శంకర వ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీతో రీజ‌న‌ల్ ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన అనిల్.. త‌న త‌ర్వాతి చిత్రాన్ని విక్ట‌రీ వెంక‌టేష్‌, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్(kalyan ram) క‌ల‌యిక‌లో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 

ఇందులో క‌ళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి న‌టించ‌నుంద‌ట‌. ఈ సినిమాలో ఛాన్స్ అన‌గానే కృతి మ‌రో ఆలోచ‌న లేకుండా ఒప్పుకుని ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రోవైపు వెంకీ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తుంద‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. అదెంత వ‌ర‌కు నిజమో తెలియ‌దు మ‌రి. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి స్క్రిప్టు వ‌ర్క్ జ‌రుగుతోంది. ఇంకో రెండు నెల‌ల్లో చిత్రీక‌ర‌ణ మొద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది. మ‌ళ్లీ సంక్రాంతినే టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందించ‌బోతున్నాడు అనిల్. కాబ‌ట్టి మ‌ళ్లీ పండ‌క్కి ఆయ‌న హిట్ కొట్ట‌డం గ్యారెంటీ అనుకోవ‌చ్చు.

 

Tags
Krithi shetty to pair with kalyan ram Anil ravipudi
Recent Comments
Leave a Comment

Related News