ఆంధ్ర రాష్ట్ర శాశ్వత, ఏకైక రాజధానిగా అమరావతి ని నిర్ణయిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లును స్వాగతిస్తూ అమెరికా రాజధాని ప్రాంత ప్రవాస తెలుగువారు సర్వత్రా తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని భానుప్రకాష్ సమన్వయపరిచారు. అమ్మలాంటి భూమాతను నమ్మి, శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతు స్వచ్ఛందంగా అమరావతి రాజధాని కోసం భూములిచ్చారని ఎన్నారై టీడీపీ నేతలు అన్నారు. తనతో పాటు ఎందరో రైతులు 1631 రోజుల పాటు ఎంతో వ్యధను భరించారని, దేశంలో మరే రైతుకు ఈ కష్టం రాకూడదని అన్నారు.
ఐదేళ్లపాటు చీకటి పాలన సాగించిన దుష్ట రాజకీయ క్రీడకు, నాయకులకు ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పారని యాష్ బొద్దులూరి అన్నారు. అమరావతి ప్రగతి రాష్ట్ర యువత భవితకు వేదిక కానుందని , ప్రపంచంలోనే అతిపెద్ద రాజధానిగా అమరావతి అవతరించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వెంకట్, మురళీ కృష్ణ కట్ల, రమేష్ అవిర్నేని, ఫణి యలమంచిలి, హనుమంతరావు యంపరాల, అభిరామ్ కందుల, కృష్ణమోహన్ జంపాల, కిషోర్ కొడాలి, వెంకటేశ్వర్రావు సామినేని, నరేంద్ర, సీతారామారావు ఎండూరు, సుబ్బారావు చిట్యాల, చంద్రనాధ్ నంబూరు, కామేశ్వరరావు కొత్తూరు, అమరలింగం చనుమోలు, మల్లికార్జునరావు పుట్రేవు, రామ్మోహనరావు చిలకలపూడి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.