అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ఎన్ ఆర్టీ చైర్మన్ రవి వేమూరు ఆదేశాల ప్రకారం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఎన్నారై టీడీపీ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు విశేష కృషి చేసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
అమరావతి కల నెరవేర్చినందుకు, కష్టపడి బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేసి పార్లమెంట్ లో బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు విశేష కృషి చేసిన లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దినదినాభివృద్ధి చెందుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం మరో పదేళ్ల పాటు అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రం ఒఖ రాజధాని నినాదంతో అమరావతి ఏపీకి శాశ్వత రాజధాని అయిన నేపథ్యంలో మెల్ బోర్న్ లోని ఎన్నారై టీడీపీ శ్రేణులు పండగ జరుపకుంటున్నాయని తెలిపారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని మరో పదేళ్ల పాటు గెలిపించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సుబ్బారావు లగడపాటి, గోపి నంబాల, సంతోష్ కొల్లిపర,వంశీ తూమాటి, ఏడుకొండలు ,అరవింద్, రవీంద్ర, వేమూరి వంశీ, వెంకట్ వట్టిరాజు, నర్మదా జొన్నలగడ్డ, మహిధర్, జనసేన వీర మహిళ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.