మూగబోయిన ఆశ గళం

admin
Published by Admin — April 12, 2026 in National
News Image

*ఆశ గళం..అమృతకలశం

మరో అద్భుతం

అదృశ్యమైపోయింది..

గంధర్వగానం తానొచ్చిన 

ఆ గంధర్వ లోకానికే మరలిపోయింది..

మొన్న లత..

ఇప్పుడు ఆశా(Asha bhosle)..

 

అమృతాన్ని గళంలో నింపుకున్న అక్కాచెల్లెళ్ళు..

హిందీ సినిమాని అర్దశతాబ్దానికి పైగా 

ఏలేసిన కోయిలమ్మలు..

ఇద్దరూ వెళ్ళిపోయారు..

 

సంగీతం చిన్నబుచ్చుకుంది..

సాహిత్యం మరోదారి వెతుక్కోలేక సతమతమవుతోంది..

కోయిలమ్మలు తమ జంట

పక్షులను కలుపుకుని

చుక్కల లోకానికి

ఎగిరిపోయాయి..

 

అక్క లతమ్మ గొంతులో

యక్షగంధర్వులనే అబ్బురపరిచే తియ్యందనం..

చిన్నమ్మ ఆశ స్వరంలో 

గమ్మత్తైన మత్తు..

ఉర్రూతలూగించే మహత్తు..

షాక్కొట్టే విద్యుత్తు

మొత్తంగా ఆ అమ్మల ఇంటిపేరు విద్వత్తు..!

 

పియతూ అబ్ తో ఆజా..

కార్వాన్లో ఈ పాట 

బాండ్ బాజా..

తీస్రీ మంజిల్లో రపీతో డ్యూయట్టంటే 

భయపడితే భోస్లే..

లతక్క అందిట నువ్వు మొదట మంగేష్కర్..

తర్వాతే భోస్లే..

ఆమాత్రం భరోసా..

ఆ పాట ఆశా కెరీర్ కే హైలేసా..

ఆ సంగీత దర్శకుడు బర్మన్

బాలీవుడ్ ఒకనాటి రెహ్మాన్

ఆశా జీవితానికే సులేమాన్

ఆమె కలల హీమాన్!

 

దమ్మారే దమ్..

దమ్ముకొడుతూ జీనత్..

మారిపోయింది ఆమె కిస్మత్..

ఏం కిట్టిందో గాని 

ఆశాకు కీమత్..

పండింది దేవానంద్ పంట..

ఆ పాట ఆల్ టైం హిట్టంట!

 

ఆధునిక సినిమా రంగీలా..

పాడేసింది ఆశా కిలాకిలా..

తరం ఏదైనా అలరిస్తునే ఉంటుంది నిరంతరం...

ఈ మోనీకా ఓ మై డార్లింగ్

అహ్ అహ్ అ ఆ..

ఆ పాట వింటుంటే ఇప్పటికీ

మన్ కీ రాజా ఠండీ హోగా..

ఇప్పుడు ఎవరు విన్నా 

ఆ మధుర గాయనికి

ప్యాన్ బనేగా!

అలాంటి పాటలు పాడుతూ

ఆశాజీ సౌ సాల్ జీయేగా!!

 

 

ఇలా ఒక తరాన్ని కాదు..

తరతరాలని అలరించిన

ఆశ..ఎన్నో పాటలకు శ్వాస..

 

తానెళ్ళినా పాటలు 

మనకి తోడుగా..

ఆస్వాదన ఆసరాగా..

అనుభూతి ఆలంబనగా..

స్వరం..ఎప్పటికీ వెన్నాడే..

వెంట ఉండే అద్భుతంగా..

 

ఆశాజీ..

మీ పాటలు వింటూ 

పెరిగాము..తిరిగాము..

అవి వింటూనే బ్రతికేస్తాము..

మరణిస్తాము కూడా..

 

సగం జీవితం మీ పాటల్లోనే..

ఇక మిగిలిన జీవితం..

మళ్ళీ ఆ పాటల ఆస్వాదనలోనే...

 

మీ పాట మా జీవితం..

మీ పాట మా జ్ఞాపకం..

మీ పాటల మా అనుభూతి..

మీ పాట మా అనుభవం..

 

ఇలా కోట్ల జీవితాల్లో

మమేకం కావడం 

మీకే సంభవం..!

 

మధురగాయని ఆశాజీకి

అక్షర నివాళి..

 

బరువెక్కిన హృదయంతో..

Tags
Asha bhosle singer died
Recent Comments
Leave a Comment

Related News

Latest News