చెన్నైకి చంద్ర‌బాబు.. కోయంబ‌త్తూరుకు ప‌వ‌న్‌!

admin
Published by Admin — April 19, 2026 in Andhra
News Image
త‌మిళ‌నాడు ఎన్నిక‌ల(tamilnadu elections) పోలింగ్ స‌మీపిస్తున్న నేప‌థ్యంలో బీజేపీ నేతృత్వంలోని అన్నాడీఎంకే కూట‌మి త‌ర‌ఫున ప్ర‌చారం చేసేం దుకు ఏపీ కూట‌మి నాయ‌కులు క‌దులుతున్నారు. ఈ మేర‌కు షెడ్యూల్ ఫైన‌ల్ అయిన‌ట్టు తెలిసింది. దీని ప్ర‌కారం.. సీఎం చంద్ర‌బాబు (cm chandrababu)సోమ‌వారం చెన్నైకి వెళ్తున్నారు. ఇక్క‌డి తెలుగు వారు స‌హా.. పారిశ్రామిక వేత్త‌లు.. ఇత‌ర రాజ‌కీయ వ‌ర్గాల‌తో చంద్ర‌బాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్ర‌భుత్వం ఏర్ప‌డాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న నొక్కి చెప్ప‌నున్నారు. అలానే చెన్నైలో నిర్వ‌హించే రోడ్ షోలోనూ పాల్గొంటారు.
 
అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌(ap deputy cm pawan kalyan).. కూడా బీజేపీ కూట‌మి త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. కోయంబ‌త్తూరు స‌హా.. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగే ఎన్నిక‌ల ర్యాలీల్లో ఆయ‌న పాల్గొంటారు. అలానే.. సీనిరంగ ప్ర‌ముఖుల‌ను కూడా క‌లుసుకుంటార‌ని తెలిసింది. దీనికి సంబంధించి కూడా షెడ్యూల్ ఖ‌రారైన‌ట్టు తెలిసింది. బీజేపీ కూట‌మి త‌ర‌ఫున ఆయ‌న పెద్ద ఎత్తున ప్ర‌చారం(election campaign) చేస్తార‌ని స‌మాచారం. ఆది నుంచి కూడా త‌మిళ‌నాడులోని హిందూత్వ‌కు మ‌ద్ద‌తుగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అక్క‌డి ఉప‌ముఖ్య‌మంత్రి.. స్టాలిన్‌కుమారుడు ఉద‌య‌నిధి స్థాలిన్ చేసిన విమ‌ర్శ‌ల‌ను గ‌తంలో బ‌లంగా తిప్పికొట్టారు.
 
ఈ నేప‌థ్యంలో హిందూ స‌మాజాన్ని బ‌లంగా త‌మ‌వైపు తిప్ప‌గ‌ల శ‌క్తి.. ప‌వ‌న్‌కు ఉంద‌ని బీజేపీ అంచ‌నా వేసుకుంది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు రెడీ చేశారు. సోమ‌వారం ఉద‌యం కోయంబ‌త్తూరులో నిర్వ‌హించ‌నున్న ఎన్నిక‌ల ర్యాలీలో ప‌వ‌న్ పాల్గొంటార‌ని స‌మాచారం. దీనికి సంబంధించి.. ఇప్ప‌టికే కార్యాచ‌ర‌ణ కూడారెడీ అయింది. కాగా.. 234 స్థానాలు ఉన్న త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ఈ నెల 23న జ‌ర‌గ‌నుంది. 21వ తేదీ సాయంత్రంతో ప్ర‌చారానికి తెర‌ప‌డుతుంది. దీంతో ప్ర‌ముఖులు స‌హా ప‌లువురు అనుకూలురుతో బీజేపీ ఇక్క‌డ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది.
Tags
cm chandrababu AP deputy CM Pawan Kalyan tamilnadu elections campaign
Recent Comments
Leave a Comment

Related News