పవన్ ఆరోగ్యంపై మోదీ ఆరా!

admin
Published by Admin — April 19, 2026 in Andhra
News Image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(ap deputy cm pawan kalyan) కు ముక్కు సంబంధిత శస్త్రచికిత్స(operation) జరిగింది. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కు ప్రధాని మోదీ (pm modi)స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తన ఆరోగ్యం గురించి వాకబు చేసిన ప్రధాని మోదీకి పవన్ ధన్యవాదాలు తెలిపారు.

శుక్రవారం ఉదయం తన అధికారులతో చర్చిస్తున్న సందర్భంలో పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు శుక్రవారం అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్య పరీక్షలలు, ఎం.ఆర్.ఐ స్కానింగ్ నిర్వహించిన తర్వాత పవన్ కు ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆ క్రమంలోనే శనివారం నాడు శస్త్రచికిత్స చేశారు.

Tags
AP deputy CM Pawan Kalyan surgery pm modi modi called pawan
Recent Comments
Leave a Comment

Related News