పేదవాళ్లకు పట్టెడన్నం పెట్టేందుకు అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆయన పేరుతో అన్న క్యాంటీన్ల(anna canteens)కు టీడీపీ(tdp) అధినేత చంద్రబాబు(cm chandrababu) 2014లో ప్రవేశపెట్టారు. అయితే, 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లకు మూసేశారు. అయితే, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు తెరిపించారు. దీంతో, పేదవాళ్లు 5 రూపాయలకే కడుపు నిండా నాణ్యమైన భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ బృహత్కార్యానికి ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(nara bhuvaneswari) తన వంతు ఆర్థిక సాయం అందించారు.
ఏప్రిల్ 20న సీఎం చంద్రబాబు 76వ పుట్టిన రోజు(cm chandrababu's 76th birth day)ను పురస్కరించుకొని అన్న క్యాంటీన్లకు భువనేశ్వరి రూ. 76 లక్షలు విరాళం(Rs.76 lakh donation)గా ఇచ్చారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో రూ. 76 లక్షల రూపాయల చెక్ ను అన్న క్యాంటీన్ సీఈవోకు సీఎం చంద్రబాబు, భువనేశ్వరి సంయుక్తంగా అందించారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని భువనేశ్వరి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం నాడు రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందించాలని భువనేశ్వరి కోరారు. దీంతో, చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయనకు భువనేశ్వరి ఇచ్చే కానుక ఇదేనని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.