ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు(cm chandrababu) 76వ పుట్టిన రోజు(76th birth day) సోమవారం జరగనుంది. దీనికి సంబంధించి పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యకర్తలు, నాయకులు రెడీ అయ్యారు. ఈ కార్యక్రమాలు అదిరిపోయేలా నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే కార్యకర్తలకు, నాయకులకు కూడా సూచించారు. రక్తదానాలు.. అన్నదానాలు.. పేదలకు సరుకులు.. వంటివాటిని విరివిగా చేపట్టాలని సూచించారు. అదేసమయంలో జగన్ పుట్టిన రోజు నాడు జరిగిన పొట్టేళ్ల నరుకుడు వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలనిఆదేశించారు.
ఈ క్రమంలోనే తాజాగా మంత్రి లోకేష్ వాట్సాప్ డిస్ ప్లే పిక్చర్(డీపీ)ని విడుదల చేశారు. దీనిలో చంద్రబాబు వంద విజయాలను ఆయన ప్రస్తావించారు. #CBN Sir birthdayCDP హ్యాష్ ట్యాగ్‌తో దీనిని విడుదల చేశారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను కవర్ చేశారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించిన పథకం నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం... రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్నికూడా ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయా సందర్భాల్లో చంద్రబాబు వేషధారణను ప్రతిబింబించేలా ప్రత్యేక చిత్రాలను కూడా జోడించారు.
అన్న క్యాంటీన్లు, పేదలకు పింఛన్లు, పెట్టుబడులు.. పరిశ్రమల ఏర్పాటు, ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు స్వచ్ఛాంధ్రకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా డీపీలో వివరించారు. దీనిని నెటిజన్లు విశేషంగా ఆదరిస్తున్నారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తున్నప్పటికీ.. సోమవారం ఉదయం 10 గంటలకుచంద్రబాబు తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. ఎన్డీయే తరఫున ఆయన అక్కడ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అయినప్పటికీ.. రాష్ట్ర స్థాయిలో మండలాల వారీగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని.. వాటి తాలూకు ఫొటోలను, నాయకుల ప్రసంగాలను మై-టీడీపీ యాప్‌లో పోస్టు చేయాలని పార్టీ ఆదేశించింది.