చంద్రబాబుకు భువనేశ్వరి బర్త్ డే విషెస్..వైరల్

admin
Published by Admin — April 20, 2026 in Andhra
News Image

ఏపీ సీఎం చంద్రబాబు(cm chandrababu) తన పుట్టినరోజు వేడుకలను(birth day wishes) భార్య భువనేశ్వరితో కలిసి సింపుల్ గా ఇంట్లో జరుపుకున్నారు. తన అర్ధాంగి భువనేశ్వరితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తన సతీమణి భువనేశ్వరి(bhuvaneswari) గురించి చంద్రబాబు చేసిన ట్వీట్ వైరల్ అయింది.

"నా అద్భుతమైన జీవిత భాగస్వామితో కలిసి మరో ఏడాదిని పూర్తి చేసుకుంటున్నా. ఆమె నిరంతర మద్దతు, హుందాతనం ఈ జీవిత ప్రయాణాన్ని నిజంగా అర్థవంతం చేస్తున్నాయి" అంటూ తన బెటర్ హాఫ్ పై ఉన్న ప్రేమను చంద్రబాబు వ్యక్తం చేశారు.

అదే రీతిలో తన భర్త చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా భువనేశ్వరి కూడా ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టారు.

" నా కోసం ఈ రోజు పుట్టావు. కోట్లాది మంది కోసం జీవించావు. మీలో సగమై.. మీ కృషిలో భాగమై.. నా స్వేచ్ఛా స్వతంత్ర సేవా సాధికార మార్గదర్శి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీ భూ" అంటూ చంద్రబాబు కేక్ కట్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఆది దంపతుల అన్యోన్య దాంపత్యానికి అద్దం పట్టే ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags
cm chandrababu nara bhuvaneshwari chandrababu's birth day wishes cake cutting
Recent Comments
Leave a Comment

Related News