ఏపీ సీఎం చంద్రబాబు(cm chandrababu) ఈ రోజు 76వ జన్మదినం(76th birth day) జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు బర్త్ డే సందర్భంగా రాష్ట్రంలోని అన్న క్యాంటీన్ల(anna canteen)లో నేడు ఉచితంగా భోజనం(free meals) అందిస్తున్నారు. ఒకరోజు అన్న క్యాంటీన్లలో భోజనం తయారీకి అయ్యే రూ.76 లక్షల రూపాయలను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(nara bhuvaneswari) విరాళంగా ఇచ్చారు. ఈ క్రమంలోనే విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు అల్పాహారం చేశారు. అన్నా క్యాంటీన్లో భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
పేదలు గౌరవంగా, కడుపునిండా భోజనం చేసేందుకే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, కేవలం రూ.5లకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లకు అదనంగా మరో 5 ప్రారంభించబోతున్నామని అన్నారు. ఇస్కాన్ ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారని తెలిపారు. బయట భోజనానికి రూ.100 ఖర్చవుతుందని...పేదలు, ఆటో డ్రైవర్లు, కార్మికులు రూ.5కే ఇక్కడ భోజనం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
అన్నదానం మహాయజ్ఞంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా భువనేశ్వరి రూ.76 లక్షలు విరాళంగా ఇచ్చి మిగతావారికి స్ఫూర్తిగా నిలిచారని, ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. విరాళం కోసం ఎవరినీ బలవంతం చేయడం లేదని, తోచిన విధంగా విరాళాలు అందించి పేదల ఆకలి తీర్చడంలో పాలుపంచుకోవాలని కోరారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యా క్యాంటీన్లలో భోజనం చేస్తున్న పేదల ముఖాల్లో ఆనందం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.