కాలిఫోర్నియా: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) జన్మదిన వేడుకలు అమెరికాలోని బే ఏరియాలో కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ దొడ్డపనేనితో పాటు వెంకట్ అడుసుమల్లి, వెంకటేశ్వరరావు కోగంటి (బిర్యానీ జంక్షన్), హరి సన్నిధి, భరత్ ముప్పిరాల, నిఖిల్ ముప్పిరాల, రవికిరణ్ ఆలేటి, సందీప్ ఇంటూరి, శివ కొంగరి తదితరులు పాల్గొని వేడుకలను దిగ్విజయం చేశారు.

చంద్రబాబు నాయుడు విజన్, ఆయన నాయకత్వ పటిమను కొనియాడుతూ అందరి కలిసి కేక్ కట్ చేశారు. ఏపీ(AP)లో కూటమి ప్రభుత్వం ఏర్పడి, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం పట్ల ప్రవాసాంధ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పథంలో నడిపించే సత్తా కేవలం ఆయనకే ఉందని, గతంలో ఐటీ రంగానికి ఆయన వేసిన పునాదులే నేడు తమ అభివృద్ధికి కారణమయ్యాయని వారు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిలో తాము కూడా క్రియాశీలక భాగస్వాములవుతామని వారు ఆకాంక్షించారు.