చిరు ఇంటి ప‌క్క‌న బ‌న్నీ కొత్త బంగ్లా.. రేటు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

admin
Published by Admin — April 22, 2026 in Movies
News Image

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం కెరీర్ పరంగానే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ అత్యున్నత స్థాయికి చేరుకుంటున్నారు. ఒకవైపు అట్లీ దర్శకత్వంలో రాబోతున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'రాకా' సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్న బన్నీ, మరోవైపు తన డ్రీమ్ హౌస్ నిర్మాణంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏమిటంటే.. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో అల్లు అర్జున్ ఒక విలాసవంతమైన రాజప్రసాదాన్ని నిర్మిస్తున్నార‌ట‌.

ఈ వార్తలో అసలైన కిక్ ఇచ్చే విషయం ఏమిటంటే, ఈ కొత్త బంగ్లాను బన్నీ ఎక్కడ నిర్మిస్తున్నారనేది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తన మామయ్య, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నివాసానికి అతి సమీపంలోనే అల్లు అర్జున్ ఈ కొత్త ఇంటిని నిర్మిస్తున్నట్లు సమాచారం. మెగా, అల్లు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పేలా, మామయ్య ఇంటికి దగ్గరలోనే ఉండాలని బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

ఈ ఇంటి నిర్మాణం కోసం అల్లు అర్జున్ పెడుతున్న ఖర్చు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాదాపు 4 వేల గజాల సువిశాల విస్తీర్ణంలో, అత్యాధునిక హంగులతో ఈ బంగ్లా రూపుదిద్దుకోనుంది. ఈ విలాసవంతమైన కోట కోసం బన్నీ(Bunny) ఏకంగా రూ. 80 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. కేవలం ఇల్లు మాత్రమే కాకుండా, అందులో ఉండే ఇంటీరియర్ డిజైన్స్, గార్డెన్ ఏరియా, హోమ్ థియేటర్ వంటి సౌకర్యాలు అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతున్నాయట.

సాధారణంగానే అల్లు అర్జున్‌కు అభిరుచి ఎక్కువ. తన కార్వాన్ నుంచి ఆఫీస్ వరకు ప్రతిదీ స్టైలిష్‌గా ఉండేలా చూసుకుంటారు. అందుకే ఈ కొత్త ఇల్లు కూడా ఒక రాజప్రసాదంలా ఉండాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. అటు 'రాకా'(Raaka) షూటింగ్‌తో బిజీగా ఉంటూనే, మరోవైపు ఈ ఇంటి పనులను కూడా బ‌న్నీ చూసుకుంటున్నాడ‌ని టాలీవుడ్‌లో టాక్ న‌డుస్తోంది.

Tags
Allu Arjun Icon Star Raaka Allu Arjun New House Jubilee Hills Chiranjeevi Tollywood
Recent Comments
Leave a Comment

Related News