అమ‌రావ‌తి-హైద‌రాబాద్‌.. అనకాప‌ల్లి-రంగారెడ్డి.. బాబు పోలిక వెనుక‌!

admin
Published by Admin — April 24, 2026 in Andhra
News Image

ఏపీ సీఎం చంద్ర‌బాబు స్ట‌యిలే వేరు. వ్య‌క్తిగానే కాకుండా.. రాష్ట్రాల వారీగా కూడా ఆయ‌న పోటీ ప‌డుతుం టారు. ఎక్క‌డ అభివృద్ధి జ‌రిగితే... ఆ ప్రాంతంతో పోటీ పెట్టుకుని ముందుకు సాగుతారు. ఫ‌లితంగా ఎదు గుద‌ల సాకారం అవుతుంద‌న్న‌ది ఆయ‌న వాద‌న‌. ఈ క్ర‌మంలోనే ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి.. ఇప్ప‌టికే అభివృద్ధి చెందిన తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌కు పోలిక పెట్టి ముందుకు సాగుతున్నారు.

పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌లోనూ ద‌క్షిణాది రాష్ట్రాల‌తో సీఎం చంద్ర‌బాబు పోటీ పడుతున్నారు. అమ‌రావ‌తిని హైద‌రాబాద్‌తో పోలిక పెట్టి.. వ‌చ్చే కొన్ని సంవ‌త్స‌రాల్లో హైద‌రాబాద్‌ను మించిపోయేలా మ‌హాన‌గ‌రంగా తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, తాజాగా.. ఎక్క‌డో ఉత్త‌రాంధ్ర‌లో ఉన్న అన‌కాప‌ల్లికి.. హైద‌రాబాద్ ను ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాకు సీఎం చంద్ర‌బాబు పోలిక పెట్టారు. అన‌కాప‌ల్లి జిల్లా.. రంగారెడ్డిని మిం చి పోతుంద‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌... చ‌ర్చ‌కు దారితీసింది.

రంగారెడ్డి జిల్లా అంటేనే పారిశ్రామికంగా.. వ్య‌వ‌సాయ ప‌రంగా కూడా ముందున్న జిల్లా. ఈ జిల్లాతో విశాఖ నుంచి విడివ‌డి కొత్త‌గా ఏర్ప‌డిన రంగారెడ్డి జిల్లాకు పోలిక పెట్టారు. దీనికి కార‌ణం.. ఇటీవ‌ల కాలంలో అన‌కాప‌ల్లికి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి. విశాఖ‌లో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా కేంద్రం రెండో ప్రాజెక్టు అన‌కాప‌ల్లిలో ఏర్పాటు చేయ‌నున్నారు. ఇక‌, తాజాగా రెన్యూ ఎన‌ర్జీ సంస్థ‌.. 5 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టును అన‌కాప‌ల్లిలో ఏర్పాటు చేస్తోంది.

అంతేకాదు.. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ కంపెనీ కూడా ఇటీవల అన‌కాప‌ల్లి జిల్లాలోని రాంబిల్లి ప్రాంతంలో `ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ ఇండియా స్టీల్ ప్లాంట్` ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది, ఇది కూడా భారీ ఉపాధిని కల్పించనుంది. అనకాపల్లి జిల్లా భారీ పారిశ్రామిక పెట్టుబడులతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేప‌థ్యంలోనే రంగారెడ్డి జిల్లాకు అన‌కాప‌ల్లికి సీఎం చంద్ర‌బాబు ముడిపెట్టారు. అమ‌రావ‌తికి-హైద‌రాబాద్‌కు పోలిక పెట్టి మ‌రీ అభివృద్ధి చేస్తున్న‌ట్టుగానే.. అన‌కాప‌ల్లిని రంగారెడ్డి త‌ర‌హాలో డెవ‌ల‌ప్ చేయ‌నున్నారు. 

Tags
Cm chandrababu anantapur to Rangareddy logical thought
Recent Comments
Leave a Comment

Related News