జ‌గ‌న్ ఆప్త‌మిత్రులు.. ఒక‌రు స్టేష‌న్‌కు మ‌రొక‌రు కోర్టుకు!

admin
Published by Admin — April 26, 2026 in Andhra
News Image
వైసీపీ అధినేత జ‌గ‌న్‌(ycp chief jagan)కు ఆప్త‌మిత్రులుగా భావించే ఇద్ద‌రి విష‌యంలో ఒకే రోజు ఒకే స‌మ‌యంలో భారీ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. కేసులు వేర్వేరు అయిన‌ప్ప‌టికీ.. జిల్లాలు వేరుగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల్లో ఒక‌రు స్టేష‌న్‌కు.. మ‌రొక‌రు కోర్టుకు వెళ్ల‌డంతో నాయ‌కులు విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఇద్ద‌రి విష‌యం కూడా పార్టీ కార్యాల‌యంలో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది.

ఎవ‌రు వారు?

వీరిలో ఒక‌రు.. పార్టీ రాష్ట్ర కోఆర్డినేట‌ర్‌.. గ‌తంలో స‌క‌ల శాఖల మంత్రిగా పేరు తెచ్చుకున్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కుమారుడు స‌జ్జ‌ల భార్గ‌వ‌రెడ్డి(sajjala bhargav reddy). రెండో వ్య‌క్తి.. ప్ర‌జాప్ర‌తినిధి, ఎమ్మెల్సీ అనంత‌బాబు(mlc anantababu). ఇద్ద‌రూ కూడా జ‌గ‌న్‌కు ఆప్త‌మిత్రులే. స‌జ్జ‌ల భార్గ‌వ‌రెడ్డి.. వైసీపీ సోష‌ల్ మీడియాకు ఇంచార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌సంగాల‌ను కూడా రాస్తున్నార‌ని ఇటీవ‌ల ప్ర‌చారంలో ఉంది. ఇక‌, అనంత‌బాబు.. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు. ఆయ‌న శ‌వాన్ని డోర్ డెలివ‌రీ చేసినా.. చ‌ర్య‌లు తీసుకోలేనంత స‌న్నిహితుడు!.

ఏం జ‌రిగింది..

స‌జ్జ‌ల భార్గ‌వ రెడ్డి విష‌యానికి వ‌స్తే.. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, లోకేష్‌ల‌ను చిత్రాతి చిత్రంగా వ‌ర్ణిస్తూ.. వారి చేతుల్లో క‌త్తులు పెట్టి రూపొందించిన ఫొటోలోను సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశార‌ని కేసు న‌మోదైంది. 2022 నుంచి ఎన్నిక‌ల వ‌రకు ఇలా వంద‌ల ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి ప్ర‌చారం చేశార‌ట‌. దీంతో ఆయ‌న‌పై 2024లో కేసు న‌మోదు కాగా.. తాజాగా పులివెందుల పోలీసు స్టేష‌న్‌కు హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌ను డీఎస్పీ స్థాయి అధికారి విచారిస్తున్నారు.

ఇక‌, అనంత‌బాబు విష‌యానికి వ‌స్తే.. త‌న మాజీ డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని చంపి.. శ‌వాన్ని డోర్ డెలివ‌రీ చేసిన కేసులో సాక్ష్యుల‌ను ప్ర‌భావితం చేశార‌ని..కేసు న‌మోదైంది. వారికి లంచాలు ఇచ్చి.. సాక్షుల‌ను బెదిరించార‌న్నది ప్ర‌ధాన అభియోగం. ఈ క్ర‌మంలో కేసు న‌మోదు కాగా.. నాలుగు రోజులు త‌ప్పించుకుని తిరిగిన ఆయ‌న‌ను గ‌త రాత్రి అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో కాకినాడ కోర్టుకు పోలీసులు హాజ‌రు ప‌రిచారు. కాగా.. ఈ రెండు ఘ‌ట‌నలు శ‌నివారం  ఉద‌యం 11-12 గంట‌ల మ‌ధ్య జ‌ర‌గ‌డం యాదృచ్ఛిక‌మే అయినా.. పార్టీలో చ‌ర్చ‌కు దారితీశాయి.
Tags
sajjala bhargav reddy court case YCP MLC Anantha Babu jagan
Recent Comments
Leave a Comment

Related News