ఇది ప్రారంభం మాత్రమేనని.. టీఆర్ ఎస్(trs) మాత్రమే ప్రధాన ప్రతిపక్షం అవుతుందని.. రెండేళ్లలో అధికా రంలోకి వస్తున్నామని కవిత(kavita) చెప్పారు. కేసీఆర్(kcr).. ఏ తప్పు చేశానని తనను పార్టీ నుంచి బయటకు పంపిం చారని ఆమె ప్రశ్నించారు. తాను అధికారంలోకి వచ్చాక.. తన బిడ్డలే తప్పు చేసినా.. పక్కన పెడతానన్న కేసీఆర్.. ఆయన తప్పులను ఎత్తి చూపించినందుకే తనను పార్టీ నుంచి బయటకు పంపించారని కవిత వ్యాఖ్యానించారు. ఆయన చేసిన తప్పులు కోకొల్లలుగా ఉన్నాయన్నారు.
పార్టీలో జెండాలు మోసిన కార్యకర్తలు.. కనీసం తమకు గుర్తింపు ఉంటే చాలని కోరుకున్నారని.. కానీ, కేసీఆర్ వారిని ఏమాత్రం గుర్తించలేదన్నారు. పోనీ.. అధికారంలోకి వచ్చిన తర్వాతైనా వారికి గుర్తింపు ఇచ్చారా? అంటే.. అది కూడా లేదని.. తీవ్రాతి తీవ్రంగా అవమానించారని గుర్తు చేశారు. ఉద్యమకారుల బిడ్డలు చనిపోతే కనీసం పరామర్శించలేదని అన్నారు. రాష్ట్రంలో 6 లక్షల నామినేటెడ్ పోస్టులు ఉంటే.. ఒక్కటి కూడా ఉద్యమకారులకు ఇవ్వలేదన్నారు.
అంతేకాదు.. నాడు ఉద్యమ సమయంలో లాఠీలతో కొట్టించిన వారిని తీసుకువచ్చి తన పక్కన కూర్చోబె ట్టుకుని వారికి పదవులు ఇచ్చారని విమర్శించారు. ఇలాంటి కేసీఆర్.. మన కేసీఆర్ కాదని దుయ్యబట్టారు . రాష్ట్రంలో హైడ్రా వచ్చి పేదలపై పంజా విసురుతుంటే.. ఆదుకో అన్నా.. అంటూ ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని.. కానీ, ఆయన అడుగు కూడా బయట పెట్టలేదన్నారు. బస్సు యాక్సిడెంట్ జరిగితే.. కూడా కనీసం పన్నెత్తు పలకరింపు కూడా లేకుండా పోయిందన్నారు.
ఒకప్పుడు కేసీఆర్ అంటే.. కన్నెత్తి చూసేందుకు భయ పడే పరిస్థితి ఉండి.. కాళ్లకు మొక్కాలని అనిపించే దని కవిత చెప్పారు. కానీ.. ఇప్పుడు అదే కేసీఆర్‌ను ప్రశ్నించక తప్పడం లేదన్నారు. బరాబర్ కేసీఆర్‌ను ప్రశ్నించేందుకు తాను సిద్ధమయ్యాయనని.. మీరంతా సిద్ధమేనా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌పై కొట్టాడేం దుకు కలిసి రావాలని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ``ఇది ప్రారంభం మాత్రమే. ఇల్లు అలికినం.. బిఫోర్.. క్రొకడైల్ ఫెస్టివలే`` అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
కవిత సభలో చిత్రాలు..
+ కవిత పార్టీ టీఆర్ ఎస్ ప్రకటన సమయంలో సీఎం సీఎం అంటూ.. పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేశారు.
+ కేసీఆర్‌ను విమర్శించిన సమయంలో పెద్ద ఎత్తున స్పందన కనిపించింది.
+ నిర్దేశిత ప్రాంగణంలోనే నిర్వహించడంతో ఆహ్వానితులకు మాత్రమే ఎంట్రీ ఇచ్చారన్న చర్చ జరిగింది.
+ వేదికపై నిలబడి ప్రసంగించారు. నీలం రంగు బోర్డర్ ఉన్న లైట్ ఆకుపచ్చ శారీ.. అదే కలర్ బ్లౌజ్ ధరించారు.
+ వస్త్ర ధారణలో `పెద్దరికాన్ని` ప్రదర్శించారు.
+ తన ప్రసంగంలో తొలి, మలి తెలంగాణ ఉద్యమాన్ని ప్రస్తావించారు.
+ నాటి ఉద్యమకారులు, రచయితలు, ప్రజా గాయకులను కవిత స్మరించారు.
+ బీజేపీ, బీఆర్ ఎస్, కాంగ్రెస్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.
+ ఎక్కువగా బీఆర్ ఎస్‌ను.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని.. విమర్శలు గుప్పించారు.