మెగా కోడలి సినిమా వస్తోంది

admin
Published by Admin — April 26, 2026 in Movies
News Image
తొలి సినిమా ‘అందాల రాక్షసి’తోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన ఉత్తరాది అమ్మాయి లావణ్య త్రిపాఠి.. తర్వాత ఇక్కడ చాలా సినిమాలే చేసింది. ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించే సమయంలో మెగా కుర్రాడు వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడ్డ లావణ్య.. కొన్నేళ్ల ముందు తనను పెళ్లాడిన సంగతి తెలిసిందే. గత ఏఢాది వీళ్లిద్దరికీ ఒక బాబు కూడా పుట్టాడు. లావణ్య ప్రెగ్నెంట్ అయిన సమయంలో ఆమె ‘సతీలీలావతి’ చిత్రంలో నటిస్తూ ఉంది.
 
అయినా ఆ సినిమాను పూర్తి చేసింది కానీ.. తర్వాత నెలలు నిండడంతో ఈ సినిమాను ప్రమోట్ చేసే స్థితిలో ఆమె లేకపోయింది. లేడీ ఓరియెంటెడ్ మూవీ అయిన ‘సతీలీలావతి’ని లావణ్యనే ముందుండి ప్రమోట్ చేయాల్సి ఉండడంతో ఆమె అందుబాటులో లేని కారణంగా ఈ మూవీ రిలీజ్ నిరవధికంగా వాయిదా పడిపోయింది. ఈ ఏడాది మార్చి 6న రిలీజ్ చేయాలని అనుకున్నారు. డేట్ కూడా ఇచ్చారు. కానీ అప్పుడు విడుదల కుదరలేదు. సినిమా వాయిదా పడిపోయింది.
 
ఐతే ఇప్పుడు ఫైనల్‌గా ఈ చిత్రాన్ని మే 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. మే తొలి వారంలో జెట్‌లీ, గాయపడ్డ సింహం లాంటి క్రేజీ మూవీస్ రిలీజవుతుండగా.. మే 14న మా ఇంటి బంగారం, వీరభద్రుడు లాంటి చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మధ్యలో మే 8నే పెద్దగా పోటీ లేదు. ఆ రోజు రవిబాబు మూవీ ‘రేజర్’ మాత్రమే రిలీజ్ కానుంది. కాబట్టి ఇది ‘సతీలీలావతి’కి మంచి డేటే. భీమిలి కబడ్డీ జట్టు, ఎస్ఎంఎస్ చిత్రాలు రూపొందించిన తాతినేని సత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.
 
కొత్త ప్రొడ్యూసర్ నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. కొత్తగా పెళ్లయిన ఒక జంట ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో నడిచే ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ ఆసక్తి రేకెత్తించింది. త్వరలో ‘సతీలీలావతి’ ట్రైలర్ లాంచ్ చేయబోతోంది చిత్ర బృందం. మరి కమల్ హాసన్ నటించిన ఐకానిక్ మూవీ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.
Tags
Lavanya Tripathi sathi leelavathi movie telugu movie mega family
Recent Comments
Leave a Comment

Related News