రాజకీయాల్లో ప్రచారం కోసం నేతలు చేసే విన్యాసాలు కొన్నిసార్లు హద్దులు దాటుతుంటాయి. తాజాగా తిరుపతిలో వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి(Bhumana Abhinay Reddy) చేసిన ఒక వింత నిరసన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా ఒక ఎడ్లబండిపై ఏకంగా ఆటోను, అందులో మనుషులను ఎక్కించి ఊరేగింపు నిర్వహించారు. ఆ భారాన్ని మోయలేక ఆ మూగజీవం పడిన తపన చూసి జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
ఈ ఘటనపై ప్రముఖ యాంకర్, జంతు ప్రేమికురాలు రష్మి గౌతమ్(Rashmi Gautam) తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే మూగజీవాల సంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చే రష్మి, ఈ క్రూరత్వాన్ని చూసి చలించిపోయారు. "ఆ ఎద్దు పడిన ఆవేదన ఈ మనుషులపై వెయ్యి రెట్లు ఎక్కువగా పడాలి" అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. పబ్లిసిటీ కోసం జంతువులను హింసించే హక్కు ఎవరికీ లేదని, తక్షణమే PETA, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
అయితే తమ తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి, రష్మి చేసిన విమర్శలను తట్టుకోలేక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆమెపై వ్యక్తిత్వ హననానికి (Character Assassination) దిగడం గమనార్హం. మూగజీవాల పట్ల క్రూరత్వాన్ని ఖండించడం నేరమా? ఈ చిన్న విషయాన్ని కూడా జీర్ణించుకోలేని వైసీపీ పేటీఎం బ్యాచ్, రష్మి సినిమాల్లోని క్లిప్పింగులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.
తమ నేతల తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఒక సెలబ్రిటీపై వ్యక్తిత్వ హననానికి దిగడం వైసీపీకి కొత్తేమీ కాదు. గతంలో కూడా తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఇలాగే వేధించారు. అయితే, రష్మి గౌతమ్ ఇలాంటి ట్రోలింగ్‌కు భయపడే వ్యక్తి కాదు. గతంలో జంతువుల హక్కుల కోసం సుప్రీంకోర్టు తీర్పులనే సవాలు చేసిన ఆమె, ఇప్పుడు ఈ పేటీఎం బ్యాచ్ ఏడుపులకు లొంగిపోతారని అనుకోవడం వారి అమాయకత్వమే. జంతువులను హింసించిన నేతపై చర్యలు తీసుకోవాలని ఆమె గట్టిగా డిమాండ్ చేస్తుంటే, సమాధానం చెప్పలేక వైసీపీ(YCP) కార్యకర్తలు చేస్తున్న ఈ రచ్చ ఆ పార్టీ పరువును మరింత దిగజారుస్తోంది.