వైసీపీ అధినేత జగన్(jagan).. ఏపీ రాజధానికి మావిగన్(mavigun) (మచిలీపట్నం+విజయవాడ+గుంటూరు) ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. ఇది ఎంతగా అభాసుపాలైందో కూడా అందరికీ విధితమే. వైసీపీ నాయకులు సైతం దీనిని సమర్థించలేని పరిస్థితి ఏర్పడింది. అయితే.. మరోవైపు ప్రభుత్వం ఈ ప్రతిపాద నను వ్యతిరేకిస్తూనే.. అమరావతి రాజధానిని మరింత విస్తరిస్తూ.. ఆర్థిక నగరంగా రాజధానిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
ఈ క్రమంలోనే అమరావతి(amaravati) ఎకనమిక్ జోన్‌ను తాజాగా ప్రకటించింది. దీనిని అభివృద్ది చేసేందుకు.. అం తర్జాతీయస్థాయి సంస్థలను ఆహ్వానించింది. ఈ అమరావతి ఆర్థిక ప్రాంతంలో 9 జిల్లాలను ఏకం చేయనున్నారు. వీటిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలను కలిపారు. మొత్తంగా 45 వేల చదరపు కిలో మీటర్ల పరిధిలో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని ఏర్పాటు చేయనున్నారు. తద్వారా.. ఈ ప్రాంతం రాజధానిలో కీలక పాత్ర పోషించనుంది.
దీనికి సంబంధించి.. ప్రణాళిక రూపకల్పన చేయడంతోపాటు.. అభివృద్ధికి సంబంధించిన సూచనలు సలహాలు ఇచ్చేందుకు అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించారు. ఈ మేరకు సీఆర్ డీఏ టెండర్లను ఆహ్వానించింది. దీని ప్రకారం.. వచ్చే ఆరు మాసాల్లో ప్రభుత్వానికి ఆయా సంస్థలు.. ప్రణాళికలను,.. అందించాలి. ముఖ్యంగా రాబోయే భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
స్వర్ణాంధ్ర విజన్-2047 కు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక, భూ వినియోగ ప్రణాళికలు, ఆర్థికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, అనుకూలమైన జీవన విధానం, సుస్థిరాభివృద్ధి వంటి లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రణాళికలు ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ ప్రణాళికలు, నగరాల అభివృద్ధికి.. సింగపూర్ ప్రభుత్వం సహకారం అందించనుంది. ఆర్థికంగా ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ తోడ్పడనుందని ప్రభుత్వం వివరించింది. దీంతో మావిగన్ అనే మాట ఇక వినిపించే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.