తమిళనాడు ఫినిష్‌.. విజ‌య్ నెక్స్ట్ టార్గెట్ ఏపీయేనా..?

admin
Published by Admin — May 06, 2026 in Politics, Andhra, National
News Image

తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్(Thalapathy Vijay) సృష్టించిన ప్రకంపనలు ఇంకా చల్లారకముందే, ఆయన చూపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై పడిందా? అంటే అవుననే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. తమిళగ వెట్రి కళగం (TVK) స్థాపించిన అనతి కాలంలోనే అక్కడ అధికార పీఠానికి చేరువైన విజయ్, ఇప్పుడు తన పొలిటికల్ ఎంపైర్‌ను తెలుగు గడ్డపైకి విస్తరించేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

విజయ్ వెనుక ఒక బలమైన మేధావి ఉన్నారన్నది బహిరంగ రహస్యం. ఆయనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(Prashant Kishor). ఏపీ రాజకీయాల నాడిని పట్టుకోవడంలో సిద్ధహస్తుడైన పీకే, విజయ్ ఇమేజ్‌ను ఏపీలో ఎలా వాడుకోవాలో ఇప్పటికే ఒక బ్లూప్రింట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో విజయకేతనం ఎగురవేయడం ఒక ఎత్తయితే, ఏపీలో ఉన్న శూన్యతను భర్తీ చేస్తూ మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడం మరో ఎత్తు. పీకే మార్గదర్శకత్వంలో విజయ్ టీమ్ ఇప్పటికే ఏపీలోని సామాజిక సమీకరణాలపై ఒక రహస్య సర్వే పూర్తి చేసినట్లు టాక్.

ఏపీ(AP)లో విజయ్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్, అలాగే ఇక్కడి జనాభా లెక్కలు ఆయనకు కలిసివచ్చేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కోస్తా ఆంధ్రలోని క్రైస్తవ, దళిత ఓటు బ్యాంకు ఇప్పుడు ఏ పార్టీ వైపు స్థిరంగా లేదు. తమిళనాడు కంటే ఏపీలో మైనారిటీల ప్రభావం ఎక్కువ ఉండటం టీవీకేకు పెద్ద అడ్వాంటేజ్. వైసీపీకి దూరమవుతున్న కేడర్‌ను, కూటమిపై అసంతృప్తితో ఉన్న తటస్థ ఓటర్లను ఆకర్షించడం ద్వారా గేమ్ ఛేంజర్ అవ్వాలని విజయ్ భావిస్తున్నార‌ట‌.

అయితే విజయ్ వ్యూహం చాలా చిత్రంగా ఉండబోతోంది. తెలంగాణ(Telangana)లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, ఏపీలో మాత్రం ఎవరికీ లొంగకుండా తన సొంత ఉనికిని చాటుకోవాలని భావిస్తున్నార‌ట‌. జాతీయ పార్టీల అండదండలతో, మరో ఏడాది కాలంలోనే ఏపీలో టీవీకే శాఖను అధికారికంగా ప్రారంభించి.. గడప గడపకూ దళపతి పేరును తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, ఏపీ రాజకీయాల్లో మరో బిగ్ సినీ స్టార్ ఎంట్రీతో సమీకరణాలన్నీ తారుమారు కావడం ఖాయం.

Tags
Thalapathy Vijay TVK Vijay Political Entry Andhra Pradesh AP Politics AP News Vijay TVK Andhra
Recent Comments
Leave a Comment

Related News