దేశంలోనే తొలిసారి.. సీఎం కాకముందే విజయ్ సంచలన నిర్ణయం!

admin
Published by Admin — May 06, 2026 in Politics, National
News Image

తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త చరిత్ర లిఖించబడబోతోంది. వెండితెరపై దళపతిగా కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (TVK) ఇప్పుడు అధికార పీఠాన్ని అధిష్టించేందుకు సిద్ధమైంది. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే విజయ్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం అంటే అది ప్రభుత్వ అధికారిక వేడుక. దీనికి అయ్యే భారీ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే భరిస్తారు. పందిళ్లు, సెక్యూరిటీ, ఆహ్వానాలు, ఇతర ఏర్పాట్ల కోసం కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చవుతుంది. కానీ, విజయ్(Vijay) ఇక్కడే తన ప్రత్యేకతను చాటుకున్నారు. తన ప్రమాణ స్వీకార వేడుకకు అయ్యే మొత్తం ఖర్చును పార్టీ నిధుల నుంచే భరించాలని ఆయన నిర్ణయించారు. ప్రభుత్వ సొమ్ముపై పైసా భారం పడకూడదనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం దేశ రాజకీయాల్లోనే మొట్టమొదటిది కావడం విశేషం.

మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన బలం 118. తాజా ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. మెజారిటీకి కేవలం 10 స్థానాల దూరంలో నిలిచిన తరుణంలో, విజయ్ రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయ్‌(Vijay)కు మద్దతు ప్రకటించడంతో పొత్తు ఖరారైంది. మరికొంతమంది స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతుతో టీవీకే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటేస్తుంది.

ఇక‌పోతే తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 7వ తేదీన‌ చెన్నై(Chennai)లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ అట్టహాస వేడుక జరగనుంది. అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 

Tags
Vijay TVK Tamil Nadu Elections 2026 Thalapathy Vijay CM Vijay Tamil Nadu Politics
Recent Comments
Leave a Comment

Related News