ప్రభాస్ రియల్ క్యారెక్టర్ అదే.. జ‌గ‌ప‌తి బాబు షాకింగ్ కామెంట్స్‌!

admin
Published by Admin — May 25, 2026 in Movies
News Image

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉంటారు. కానీ, కొందరి ప్రవర్తన, వ్యక్తిత్వం మాత్రమే అందరి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెడుతుంది. అలాంటి అరుదైన గుణం ఉన్న వ్యక్తి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని టాలీవుడ్(Tollywood) సీనియర్ యాక్టర్ జగపతి బాబు ప్రశంసల వర్షం కురిపించారు. రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ప్రభాస్ అసలు సిసలైన మనస్తత్వం గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను పంచుకున్నారు.

సాధారణంగా స్టార్ హోదా వచ్చాక చాలామందిలో ఇగో పెరుగుతుంది. కానీ ప్రభాస్(Prabhas) మాత్రం అందుకు పూర్తి భిన్నమని జగపతి బాబు చెప్పుకొచ్చారు. తను తీవ్రమైన మానసిక ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతూ.. ఎవరితోనైనా మాట్లాడితే బాగుండు అనిపించిన క్లిష్ట సమయంలో ప్రభాస్ గుర్తొచ్చాడని ఆయన అన్నారు. ఆ సమయంలో ప్రభాస్ ఇండియాలో లేడు, సుదూర జార్జియా దేశంలో షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయినా సరే, జగపతి బాబు చేసిన ఫోన్ కాల్‌కు వెంటనే స్పందించి, ఎంతో ప్రేమగా ధైర్యం చెప్పడం ప్రభాస్ సంస్కారానికి నిదర్శనమని కొనియాడారు.

ఆ కఠిన పరిస్థితుల్లో ప్రభాస్ నోటి నుంచి వచ్చిన ‘డార్లింగ్ నేనున్నానుగా.. నీ సమస్యేంటో చెప్పు, నేను చూసుకుంటా’ అనే మాటలు తనకు కొండంత అండగా నిలిచాయని జగపతి బాబు(Jagapathi) ఎమోషనల్ అయ్యారు. కేవలం ఫోన్ కాల్‌తో సరిపెట్టకుండా, షూటింగ్ ముగించుకుని ఇండియా రాగానే ప్రభాస్ స్వయంగా కలిసి మాట్లాడి తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడని గుర్తుచేసుకున్నారు. వయసులో తనకంటే చాలా చిన్నవాడైనప్పటికీ, అందరినీ ఆదరించే విషయంలో ప్రభాస్ హృదయం ఎంతో పెద్దదని ఆయన కొనియాడారు.

కాగా, జగపతి బాబు ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan), జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' లో ఆయన 'అప్పలసూరి' అనే పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఒకవైపు కెరీర్ పరంగా సత్తా చాటుతూనే, మరోవైపు తోటి నటీనటుల గొప్పదనాన్ని ఇలా బహిరంగంగా అభినందిస్తూ జగపతి బాబు వార్తల్లో నిలిచారు.

Tags
Jagapathi Babu Prabhas Tollywood Peddi Telugu Movies Latest News
Recent Comments
Leave a Comment

Related News