కాలిఫోర్నియాలో ఘ‌నంగా మ‌హానాడు వేడుక‌లు!

admin
Published by Admin — May 29, 2026 in Nri
News Image

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, తెలుగు తేజం స్వర్గీయ నందమూరితారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా కాలిఫోర్నియా(California)లోని గోదావరి రుచులు బ్యాంకెట్ హాల్‌లో మహానాడుకార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో ఎన్ఆర్ఐ తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సభా ప్రాంగణం పసుపుజెండాలతో కళకళలాడుతూ పండుగ వాతావరణాన్ని తలపించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వర్గీయ ఎన్టీఆర్(NTR) ఆశయాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడునాయకత్వం, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగామరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ సందేశం పంపారు.

అదేవిధంగా చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు మరియు ఎన్నారై శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గౌతు శిరీష, ఏపీ(AP) బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, ఏపీ ప్రభుత్వ సలహాదారుమరియు ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షులు డాక్టర్ రవి వేమూరు తదితరులు పాల్గొని తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి, ఎన్టీఆర్ వారసత్వం మరియు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ దిశపై తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు.

కార్యక్రమంలో పలువురు నాయకులు యువనేత నారా లోకేష్(Nara Lokesh) నాయకత్వసామర్థ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పార్టీని తదుపరి స్థాయికి తీసుకెళ్లగల దూరదృష్టి, యువతలో ఆయనకు ఉన్న విశేష ఆదరణ, కొత్త తరం ఆలోచనలతో ముందుకుసాగే Gen-Z నాయకత్వ లక్షణాలను కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో నైపుణ్యం, యువతను ఆకర్షించే నాయకత్వ గుణాలు, పార్టీ భవిష్యత్తును బలోపేతం చేసే శక్తి నారాలోకేష్‌ను యువత ఐకాన్‌గా నిలబెడుతున్నాయని అభిప్రాయపడ్డారు.

అమెరికా బే ఏరియా నుంచి యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న రాఖీ ఇస్రాని కూడా ఈ మహానాడు(Mahanadu) కార్యక్రమానికి హాజరై, స్వర్గీయ ఎన్టీఆర్ విశిష్ట నాయకత్వాన్ని స్మరించుకుంటూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయన చేసినసేవలను ప్రశంసించారు.

చివరగా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి(MLA Bandaru Sravani) స్ఫూర్తిదాయక ప్రసంగంతో సభకు హాజరైన వారందరినీఆకట్టుకున్నారు. ఈ మహానాడు కార్యక్రమాన్ని శ్రీకాంత్ దొడ్డపనేని సమన్వయం చేసి అత్యంత విజయవంతంగా నిర్వహించగా, కార్యక్రమానికి హాజరైన ప్రతీ ఒక్కరూ ఆయన నిర్వహణను అభినందించారు. వెంకట్ అడుసుమల్లి, మురళి గొడవర్తి, భక్త బల్లా, సురేష్ పోతినేని, వెంకట్ కొల్లా, సుధీర్ వున్నం, సుబ్బ యంత్ర, చంద్ర గుంటుపల్లి, సందీప్ ఇంటూరి, రాజశేఖర్, ఎంవీ రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

News Image
News Image
Tags
Mahanadu 2026 TDP Mahanadu California Mahanadu NRI Mahanadu NTR 103 NTR Jayanthi NRI
Recent Comments
Leave a Comment

Related News