ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో భూమా కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నంద్యాల, ఆళ్లగడ్డ రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన ఈ కుటుంబం నుంచి ఇప్పుడు మరో వారసురాలు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల చిన్న కుమార్తె.. సినీ నటుడు మంచు మనోజ్ భార్య అయిన భూమా మౌనిక రెడ్డి త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు మనోజ్(Manchu Manooj) స్వయంగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. మౌనికకు ప్రజల్లోకి వెళ్లి సేవ చేయాలనే బలమైన కోరిక ఉందని, ఆమె రాజకీయ నిర్ణయాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని మనోజ్ ప్రకటించడంతో నంద్యాల, కర్నూలు జిల్లాల రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. గత కొంతకాలంగా తెరవెనుక సోషల్ సర్వీస్ చేస్తున్న మౌనిక, ఇప్పుడు నేరుగా ప్రజాక్షేత్రంలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఫిక్స్ అయ్యారట.
అయితే అందరి దృష్టి ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపైనే ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మౌనిక కర్నూలు(Kurnool) లోక్‌సభ స్థానంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేసి నేరుగా ఢిల్లీ వేదికగా తన పొలిటికల్ కెరీర్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేయాలనేది ఆమె ప్లాన్ అని టాక్. ఒకవేళ సమీకరణాలు కుదరక ఎంపీ సీటు మిస్ అయితే.. కంబైన్డ్ కర్నూలు జిల్లాలోని ఏదో ఒక కీలకమైన అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగానైనా బరిలోకి దిగడం ఖాయమని సమాచారం.
భూమా కుటుంబానికి ఉన్న పాత క్యాడర్, ఇటు మంచు ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ రెండూ తోడైతే మౌనికకు తిరుగుండదని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ చూస్తుంటే ఆమె ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు? ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తారు? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఏదేమైనా భూమా మౌనిక(Bhuma Mounika) ఎంట్రీతో రాయలసీమ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలుకావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.