విశాఖ స్టీల్ ప్లాంట్(vizag steel plant) లో ఘోర ప్రమాదం జరిగింది. స్టీల్ బెల్ట్ కన్వేయర్ తెగడంతో మరుగుతున్న ఉక్కు ద్రవం కార్మికుల మీద పడింది. ఈ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం(8 workers died) పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఘటనా స్థలం దగ్గర సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు(cm chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(deputy cm pawan kalyan), మంత్రి నారా లోకేష్(minister lokesh) లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సహాయక చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అన్నారు.
ఈ ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందడం తీరని విషాదమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ దుర్ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని లోకేశ్ ప్రార్థించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని లోకేష్ తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.