ఫ్యూచ‌ర్ సిటీ నుంచే పాల‌న‌.. రేవంత్ ప‌క్కా ప్లాన్‌!

admin
Published by Admin — June 15, 2026 in Telangana
News Image
తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి త‌న క‌ల‌ల నిర్మాణంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఫ్యూచ‌ర్ సిటీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఇటీవ‌లే మ‌రో 316 ఎక‌రాల అద‌న‌పు స్థ‌లాన్నికూడా సేక‌రించారు. దీనిని మ‌రింత విస్త‌రించేందుకు కూడా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యూచ‌ర్ సిటీ.. 2030 నాటికి అందుబాటులోకి రానుంది. అయితే.. ఈలోగానే.. ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు.. న‌గ‌రాన్ని ఇత‌ర పోర్టులు, అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాలు.. ముఖ్యంగా ఏపీ, క‌ర్ణాట‌క, త‌మిళ‌నాడు రాజ‌ధానుల‌కు అనుసంధానించే ప‌నుల‌ను ముమ్మ‌రంగా చేప‌ట్టారు.
 
ఇటీవ‌లే.. ఫ్యూచ‌ర్ సిటీలో నిర్మిస్తున్న `ఫ్యూచర్ సిటి డెవలప్‌మెంట్ అథారిటీ బిల్డింగ్` నిర్మాణం పూర్త‌యింది. దీనిని పూర్తిగా ప‌ర్యావ‌ర‌ణ హితంగా నిర్మించారు. ఇక‌, ఈ భ‌వ‌నం నుంచిఫ్యూచ‌ర్ సిటీప‌నుల‌ను, ఇక్క‌డ ఏర్పాటు కానున్న సంస్థ‌ల కార్య‌క్ర మాల‌ను కూడా ప‌ర్య‌వేక్షించ‌నున్నారు. ఇదేస‌మ‌యంలో ఈ భ‌వ‌నంలోనే ప్ర‌భుత్వం స‌చివాల‌యం ఏర్పాటు చేసి.. పాల‌న‌ను ఇక్క‌డ నుంచే చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. త‌ద్వారా..ఫ్యూచ‌ర్ సిటీకి ప్ర‌జ‌ల్లోను.. ఇటు ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోనూ గుర్తింపు వేగంగా వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఫ్యూచ‌ర్ సిటీలో సీఎం వారినికి రెండు రోజులు ఉండి.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌నున్నార‌ని స‌మాచారం.
 
అలాగే.. మంత్రివ‌ర్గ స‌మావేశాల‌ను కూడా ఈ భ‌వ‌నం నుంచే నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిసింది. త‌ద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యూచ‌ర్ సిటీకి ప్ర‌చారంతోపాటు.. ప్ర‌జ‌ల రాక‌పోక‌లు కూడా పెరుగుతాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక‌, ఈ న‌గ‌రం పూర్తిగా అందుబాటులోకి వ‌స్తే.. 30 నుంచి 50 ల‌క్ష‌ల మంది జ‌నాభా ఇక్క‌డే స్థిర‌నివాసాలుఏర్పాటు చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని లెక్క‌లు వేశారు. ఈలోగా.. క‌నీసం 10 -25 ల‌క్ష‌ల మంది జ‌నాభా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మౌలిక సదుపా యాలు, అధునాతన వసతులు, విద్యా, ఉపాధి అవకాశాలు వంటి వాటిని ఏర్పాటు చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రెడీ చేశారు. దీనిపై త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న జారీ చేయ‌నుంద‌ని అధికారులు చెబుతున్నారు.
 
అన్నీ గ్రీన్‌తోనే..
 
ఫ్యూచ‌ర్ సిటీలో జ‌రుగుతున్న నిర్మాణాలు అన్నీ.. ప‌ర్యావ‌ర‌ణ హితంగా ఉంటున్నాయి. ఒక్క నిర్మాణాలే కాదు.. నీటి సంర‌క్ష ణ‌కు పెద్ద‌పీట వేస్తున్నారు. అదేస‌మ‌యంలో అన్ని వాహ‌నాల‌ను విద్యుత్‌వే వినియోగించ‌నున్నారు. దీనికి సంబంధించి విరివిగా చార్జింగ్ స్టేష‌న్ల‌ను నిర్మించ‌నున్నారు. త‌ద్వారా.. ప‌ర్యావ‌ర‌ణ హిత‌, అనుకూల న‌గ‌రంగా ఫ్యూచ‌ర్ సిటీని రూపొందించ‌ను న్నారు. 1400 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించ త‌ల‌పెట్టిన ఫ్యూచ‌ర్ సిటీని..త్వ‌ర‌లోనే 2 వేల ఎక‌రాల‌కు విస్త‌రించ‌నున్నారు. వీటిలోనే ఇత‌ర మౌలిక‌.. ప్ర‌పంచ స్థాయి సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌నున్నారు. ముఖ్యంగా సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేలా పాల‌న‌ను ఇక్క‌డ నుంచే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.
Tags
cm revanth reddy future city ruling
Recent Comments
Leave a Comment

Related News