టాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఏం చేసినా అందులో ఒక వైవిధ్యం ఉంటుంది. ముఖ్యంగా తన సినిమాలకు ఆయన పెట్టే టైటిల్స్ థియేటర్లకు ఆడియన్స్‌ను లాగడంలో ఫస్ట్ ఇంప్రెషన్‌ను క్రియేట్ చేస్తాయి. తాజాగా విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఆయన ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించిన ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాకు మేకర్స్ పరిశీలిస్తున్న టైటిల్ విని ఇండస్ట్రీ వర్గాలు సైతం "అదేం టైటిల్ అనీల్..?" అంటూ ఆశ్చర్యపోతున్నాయి.
ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు ‘జనవరి 13 విడుదల(January 13 Vidudala)’ అనే విచిత్రమైన టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. సాధారణంగా సినిమాలకు కథానాయకుడి పాత్రను బట్టో, లేదా కథాంశాన్ని బట్టో పేరు పెడతారు. కానీ, ఇలా నేరుగా ఒక తేదీని టైటిల్‌గా పెట్టడం అనేది టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగమనే చెప్పాలి. కథ మొత్తం సంక్రాంతి పండుగ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుందని, అందుకే ఈ టైటిల్ కథకు వంద శాతం న్యాయం చేస్తుందని అనిల్ రావిపూడి భావిస్తున్నారట. అంతేకాదు, 2027 సంక్రాంతి కానుకగా సరిగ్గా అదే రోజున జనవరి 13న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనేది మేకర్స్ మాస్టర్ ప్లాన్‌గా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో వెంకటేష్(Venkatesh), కళ్యాణ్ రామ్ కాంబినేషన్ సరికొత్త వినోదాన్ని పంచబోతోంది. ఇందులో వీరిద్దరూ బావా బామ్మర్దులుగా కనిపించనున్నారని టాక్. వీరి మధ్య వచ్చే ఈగో క్లాషెస్, ఒకరిపై ఒకరు వేసుకునే కౌంటర్లు థియేటర్లలో నవ్వుల పూలు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, కళ్యాణ్ రామ్ ఎనర్జీ కలవడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కీర్తి సురేశ్(Keerthy Suresh), కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు సమాచారం. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడంతో, త్వరలోనే షూటింగ్‌ను పట్టాలెక్కించి శరవేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా, టైటిల్‌తోనే సగం పబ్లిసిటీ రాబట్టడంలో అనిల్ రావిపూడి మరోసారి సక్సెస్ అయ్యారు. మరి ‘జనవరి 13 విడుదల’ అనే టైటిల్‌పై అధికారిక ముద్ర ఎప్పుడు పడుతుందో చూడాలంటే చిత్ర యూనిట్ నోరు విప్పే వరకు ఆగాల్సిందే.