మావిగన్ వర్సెస్ అమరావతి: జగన్

admin
Published by Admin — July 01, 2026 in Andhra
News Image
ఏపీ రాజ‌ధాని విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ప్ర‌తిపాదించిన మావిగ‌న్‌కే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌లు కూడా.. మావిగ‌న్ వ‌ర్సెస్ అమ‌రావ‌తి మ‌ధ్యే జ‌రుగుతాయ‌ని తెలిపా రు. తాజాగా బుధ‌వారం.. జ‌గ‌న్ తాడేప‌ల్లిలోని నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రాజ‌ధానిపై స్పందిస్తూ.. మావిగ‌న్‌కే తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు.

మావిగ‌న్ రాజ‌ధానిని ఒక్క‌రూపాయి అవినీతికి తావులేకుండా నిర్మిస్తామ‌ని జ‌గ‌న్ చెప్పారు. ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు ఎవ‌రికి ఉందో చూసుకుందామ‌ని స‌వాల్ రువ్వారు. వ‌చ్చేఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు మావిగ‌న్‌కే మొగ్గు చూపుతార‌ని తెలిపారు. మావిగ న్ కావాల‌ని అనుకునేవారే.. త‌మ‌కు ఓటు వేస్తార‌ని చెప్పారు. రాష్ట్ర రాజ‌ధానిలో అవినీతి పెద్ద ఎత్తున జ‌రుగుతోంద ని వ్యాఖ్యానించారు. స్క్వేర్‌ఫీట్‌కు ల‌క్ష‌ల రూపాయ‌ల్లో పెంచి దోపిడీ చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

కాగా.. నెల రోజుల కిందట అమ‌రావ‌తి రాజ‌ధానికి చ‌ట్ట బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని కోరుతూ.. ఏపీ అసెంబ్లీలో ప్ర‌భుత్వం తీర్మానం చేసి పంపించింది. దీనికి పార్ల‌మెంటు స‌హా.. రాష్ట్ర‌ప‌తి కూడా ఆమోద ముద్ర వేశారు. అయితే.. ఇదే స‌మ యంలో మీడియాతో మాట్లాడిన జ‌గ‌న్‌.. మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరుల‌తో క‌లిపిన రాజ‌ధాని (మావిగ‌న్‌)ని ప్ర‌తిపాదించారు. అయితే.. అప్ప‌ట్లో కేవ‌లం ప్ర‌తిపాద‌న మాత్ర‌మే చేశారు. కానీ, తాజాగా జ‌గ‌న్‌.. దీనికే క‌ట్టుబ‌డిన‌ట్టు తెలిపారు. దీనిపై ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు త‌మ‌కే ఉంద‌న్న ధీమా వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. 
Tags
mavigun jagan amaravati
Recent Comments
Leave a Comment

Related News