చంద్రబాబుపై బండ్లన్న అభిమానం..వైరల్

admin
Published by Admin — July 07, 2026 in Andhra
News Image

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ కు ఏపీ సీఎం చంద్రబాబు అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. చంద్రబాబు కోసం బండ్లన్న తిరుపతికి పాదయాత్ర కూడా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా బండ్లన్న తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. తన కూతురు జనని పెళ్లి పత్రికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఆశీస్సులతో అని బండ్లన్న ప్రింట్ చేయించిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

బండ్ల గణేశ్‌ కుమార్తె జననికి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో ఆగస్టు 16వ తేదీ  ఉదయం 11:58 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వివాహం జరగనుంది.ఈ క్రమంలోనే వివాహ ఆహ్వాన పత్రికపై శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో అని ప్రత్యేకంగా ముద్రించారు. తొలి పత్రికను తిరుమల శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్న బండ్లన్న...రెండో పత్రికను నారా భువనేశ్వరికి అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags
bandla ganesh daughter's wedding invitation cm chandrababu nara bhuvaneswari
Recent Comments
Leave a Comment

Related News