ప్రపంచవ్యాప్తంగా టీడీపీ బలోపేతం, యువత భాగస్వామ్యానికి కీలక అడుగు పడింది. తెలుగుదేశం పార్టీ సంస్థాగత విస్తరణ, ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐ నెట్‌వర్క్ బలోపేతం లక్ష్యంగా పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 'డాక్టర్ రాజా'ను గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్‌గా నియమించింది.
ప్రచారానికి దూరంగా ఉంటూ పార్టీ కోసం తెరవెనుక విశేషంగా పనిచేసిన 'డాక్టర్ రాజా' సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం, ప్రవాస తెలుగువారితో ఆయనకున్న అనుబంధం, సంస్థాగత అనుభవం, నాయకత్వం, వ్యూహాత్మక దృష్టిని పరిగణనలోకి తీసుకుని ఈ బాధ్యతలు అప్పగించింది.
ఈ సందర్భంగా 'డాక్టర్ రాజా' మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాలను సమన్వయం చేసి బలమైన గ్లోబల్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తాం. ప్రవాస తెలుగు వారి మేధస్సు, నైపుణ్యం, అంతర్జాతీయ అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నవకల్పన, యువత సాధికారతకు అనుసంధానం చేస్తాం.
AI, డిజిటల్ పరివర్తన యుగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యువ నిపుణులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి విద్య, వైద్యం, వ్యవసాయం, స్టార్టప్‌లు, సుస్థిర అభివృద్ధి వంటి రంగాల్లో భవిష్యత్‌కు అనుగుణమైన పరిష్కారాల కోసం పనిచేస్తాం.
గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీని మరింత బలోపేతం చేసి 2029 ఎన్నికల్లో పార్టీ విజయానికి కీలక శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం" అని అన్నారు.
అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, యూరప్, మధ్యప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా తదితర దేశాల్లోని ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ‘డాక్టర్ రాజా’ నియామకాన్ని హర్షాతిరేకాలతో స్వాగతించారు. వివిధ దేశాల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా నమస్తే ఆంధ్ర యాజమాన్యం, సంపాదకవర్గం 'డాక్టర్ రాజా'కు అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించింది.
