`లెనిన్` హిట్.. భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచేసిన భాగ్య‌శ్రీ‌.!

admin
Published by Admin — July 19, 2026 in Movies
News Image

చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే కేవలం అందం మాత్రమే ఉంటే సరిపోదు, అదృష్టంతో పాటు సరైన బ్రేక్ కూడా రావాలి. ఈ విషయాన్ని అక్షరాలా నిజం చేసి చూపిస్తోంది టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse). ప్రారంభంలో పరాజయాలు పలకరించినా అధైర్యపడకుండా, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా సాధించిన ఘనవిజయంతో ఆమె కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా ఊపందుకుంది.

ఈ సక్సెస్ ప్రభావం ఆమె పారితోషికంపై గట్టిగానే కనిపిస్తోంది. కెరీర్ ఆరంభంలో కేవలం రూ. 30 లక్షల బడ్జెట్ హీరోయిన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన భాగ్యశ్రీ, ‘లెనిన్(Lenin)’ సినిమా విజయంతో తన రెమ్యూనరేషన్‌ను ఏకంగా కోటిన్నరకు పెంచేసింది. అంతటితో ఆగకుండా, త్వరలోనే పట్టాలెక్కబోయే తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సక్సెస్ ఉంటే టాలీవుడ్‌లో డిమాండ్ ఎలా పెరుగుతుందో చెప్పడానికి భాగ్యశ్రీ ప్రస్తుత క్రేజే నిదర్శనం.

కాగా, కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, 'కాంత', 'లెనిన్' వంటి సినిమాల్లో వైవిధ్యమైన నటనతో మెప్పించిన భాగ్యశ్రీ.. కథా డిమాండ్ మేరకు బోల్డ్ సీన్స్ చేయడానికి, అందాల ఆరబోతకు ఎలాంటి కండిషన్లు పెట్టకపోవడం విశేషం. మేకర్స్ కి ఎలాంటి ఇబ్బంది కలిగించని నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, రాబోయే రోజుల్లో మరో క్రేజీ హిట్ కొడితే గనక టాలీవుడ్‌(Tollywood)లో మోస్ట్ వాంటెడ్ టాప్ హీరోయిన్ల జాబితాలోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags
Bhagyashri Borse Lenin Lenin Movie Tollywood Telugu Cinema Bhagyashri Remuneration
Recent Comments
Leave a Comment

Related News