నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna), సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక క్రేజీ న్యూస్ తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా కోసం మేకర్స్ ఒక విభిన్నమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. కథలోని సామాజిక కోణాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రానికి ‘కార్పెంటర్’ అనే టైటిల్‌ను దాదాపు లాక్ చేసినట్లు సమాచారం. బాలయ్య మార్క్ ఊరమాస్ ఎలిమెంట్స్‌తో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేలా కొరటాల ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.
సాధారణంగా కొరటాల శివ(Koratala Siva) సినిమాల్లో కేవలం కథ మాత్రమే కాదు, ఆ కథ నడిచే నేపథ్యం, అక్కడి ప్రజల జీవన శైలి చాలా బలంగా ఉంటాయి. ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, రీసెంట్‌గా వచ్చిన ‘దేవర’ వరకు ఆయన ప్రతి సినిమాలోనూ బ్యాక్‌డ్రాప్‌కు పెద్ద పీట వేశారు. ఇప్పుడు బాలయ్య సినిమా కోసం కూడా అలాంటి ఒక స్ట్రాంగ్ సోషల్ ఎలిమెంట్‌ను ఎంచుకున్నారట. అందుకే టైటిల్ వినడానికి కాస్త డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ, సినిమా బ్యాక్‌డ్రాప్‌కు ఇది పక్కాగా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, హై ఎమోషన్స్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని టాక్.
ఇక ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్ విషయానికి వస్తే.. ఆగస్టు చివరి వారం నుంచి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లో బాలయ్య(Balayya)పై హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లను చిత్రీకరించబోతున్నారు. కేవలం ఈ ఫైట్స్ కోసమే ఏకంగా 20 రోజులకు పైగా సమయాన్ని కేటాయించడం విశేషం. టాలీవుడ్‌లో ప్రొడక్షన్ వాల్యూస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొరటాల శివ మార్క్ సందేశం, బాలయ్య నయా మాస్ అవతారం కలబోసిన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.