మొక్కలకు నీళ్లు పోసినా.. ప్రచారం కోరుకునే నాయకులు ఉన్న రాజకీయాలను మనం చూస్తేనే ఉన్నాం. విషయం ఏదైనా... పదిమందికి తెలియాలి.. ప్రచారం కావాలి.. అనే నాయకుల సంఖ్యకు తిరుగులేదు. అయితే.. వరుసగా విజయాలు దక్కించుకుని.. ప్రజలకు అత్యంత చేరువ అయిన ఓ నాయకుడు మాత్రం ఎలాంటి ప్రచారాన్ని కోరుకోవడం లేదు. కేవలం మౌత్ పబ్లిసిటీకి మాత్రమే పరిమితం అయ్యారు. మా మంచి ఎమ్మెల్యే అనే మాటకే ఆయన పరిమితం అయ్యారు. ఆయనే పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు(Yeluri Sambasiva Rao).
2019లో వైసీపీ తుఫాను వచ్చిన సమయంలోనూ ఏలూరి ఘన విజయం దక్కించుకున్నారు. పరుచూరు(Parchur) నియోజక వర్గంలోతనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ తర్వాత.. గత ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకున్న ఆయన.. అధికార టీడీపీ తరఫున ఉన్నప్పటికీ..పదవుల కోసం పాకులాడకుండా.. ప్రజల హృదయాల్లో చోటు కోసం తపిస్తున్నారు. నిజానికి వరుసగా రెండు సార్లు విజయం దక్కించుకున్నవారే.. పదవుల కోసం ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. బహిరంగ వేదికలపై విమర్శలు కూడా చేస్తున్నారు.
అయితే.. ఇలాంటి వాటికి భిన్నంగా తనపని తాను చేసుకుని పోతున్నారు ఏలూరి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గం పరిధిలోని రైతుల(Formers)కు నీటి ఎద్దడిని ఎదుర్కొనే పంటలపై అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పంటలు వేసిన రైతులకు రోజుకు రెండు ట్యాంకర్ల చొప్పున(ఎకరానికి) నీటిని ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
తద్వారా రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. నిజానికి ఇలాంటి సమయంలో రైతులను ఆదుకోవడం అంటే.. ఎమ్మెల్యేలకు కష్టమనే చెప్పాలి. కానీ ఏలూరి ఆది నుంచి రైతు పక్షపాతిగానే ఉన్నారు. దీంతో ఇప్పుడు కష్టకాలంలో రైతులపై ఆయనప్రత్యేకదృష్టి పెట్టారు. మరోవైపు.. పాఠశాలల్లో చిన్నారులకు అందుతున్న సౌకర్యా లపైనా ఆయన శ్రద్ధ పెట్టారు. కొత్త పింఛన్ల(New Pensions) కోసం వేచి చూస్తున్నవారికి.. భరోసా కల్పిస్తున్నారు. సమస్యలపై తక్షణమే స్పందించేలా కార్యకర్తలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇలా.. ఆయన రెండేళ్లలో తన పనితీరును మరింత మెరుగు పరుచుకుని ముందుకు సాగుతున్నారు. అయితే.. ఎక్కడా ఎలాంటి ప్రచారం కోరుకోకపోవడం గమనార్హం.