పీవీ సింధు కోరికను జ‌క్క‌న తీరుస్తాడా..?

admin
Published by Admin — July 20, 2026 in Movies
News Image

ఒకరేమో కోర్టులో రాకెట్‌తో ప్రత్యర్థులను వణికించే బ్యాడ్మింటన్ క్వీన్.. మరొకరేమో వెండితెరపై విజువల్ వండర్స్‌తో ప్రపంచాన్ని మెప్పించే టాలీవుడ్ జక్కన్న. ఈ ఇద్దరి కాంబినేషన్ వినడానికే క్రేజీగా ఉంది కదూ? తాజాగా జపాన్ ఓపెన్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu)పై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే మన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సైతం సింధు అద్భుత విజయానికి అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

అయితే, ఈ ట్వీట్‌కు పివి సింధు ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి(Varanasi)’ కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు సింధు పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా.. భవిష్యత్తులో మీ సినిమాలో ఎప్పుడైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర అవసరమైతే, అందులో నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనంటూ సరదాగా త‌న మ‌న‌సులో ఉన్న కోరిక‌ను బ‌య‌ట‌పెట్టేశారు.  సింధు చేసిన ఈ క్రేజీ కామెంట్స్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి(Rajamouli)పైనే పడింది. తెరపై నటీనటుల నుండి అద్భుతమైన నటనను రాబట్టుకోవడంలో జక్కన్న దిట్ట. మరి ఒలింపిక్ మెడలిస్ట్, క్రీడా రంగాన మెరిసిన సింధు కోరికను మన్నించి, ఆయన తన తదుపరి సినిమాల్లో ఆమెకు ఒక గెస్ట్ రోల్ లేదా కీలక పాత్ర ఇచ్చే అవకాశం ఉందా? అనే చర్చ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో మొదలైంది. ఒకవేళ రాజమౌళి ఓకే అంటే.. వెండితెరపై సింధును స్పోర్ట్స్ డ్రామాలో చూడటం అభిమానులకు అంతకంటే పండగ మరొకటి ఉండదు. మరి ఈ స్టార్ ప్లేయర్ కోరికను జక్కన తీరుస్తారో లేదో చూడాలి.

Tags
PV Sindhu SS Rajamouli Varanasi Movie Japan Open 2026 Jakkanna Telugu Cinema Latest News
Recent Comments
Leave a Comment

Related News