మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులతో పాటు విమర్శకుల మన్ననలు పొందగలిగిన అరుదైన నటుడు మమ్ముట్టి. మలయాళ ప్రజలు మమ్ముకా అని ప్రేమగా పిలుచుకునే మమ్ముట్టి ఏడుపదుల వయసులో కూడా విలక్షణమైన పాత్రలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు.
ఆ క్రమంలోనే మమ్ముట్టి నటించిన భ్రమయుగం చిత్రం మలయాళ చలనచిత్ర పరిశ్రమతోపాటు భారతీయ సినీ చరిత్రలో ఒక మాస్టర్ పీస్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాలో మమ్ముట్టి నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును ఆయనకు తెచ్చిపెట్టింది. కోడుమన్ పోటీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన మమ్ముట్టి ఆ పాత్రలో జీవించినందుకుగాను ఆయనకు సరైన గౌరవం దక్కింది.
72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు మమ్ముట్టికి దక్కింది. మమ్ముట్టితో పాటు బాలీవుడ్ చిత్రం చందూ ఛాంపియన్ లో నటనకు గాను కార్తీక్ ఆర్యన్ కూడా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్నారు. బాలీవుడ్ చిత్రం ఆర్టికల్ 370కు గాను ఉత్తమ నటిగా యామి గౌతమ్ ఎంపికయ్యారు.
ఉత్తమ తెలుగు చిత్రంగా 'కమిటీ కుర్రాళ్లు' నిలిచింది. పుష్ప-2 చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్(ఒరిజినల్) గా దర్శకుడు సుకుమార్...బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా దీపాలి నూర్, శీతల్ శర్మలు ఎంపికయ్యారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ ’ చిత్రం నిలిచింది.
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల లిస్ట్:
ఉత్తమ నటుడు: కార్తిక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్)
ఉత్తమ నటుడు: మమ్ముట్టి (భ్రమయుగం)
ఉత్తమ నటి: యామి గౌతమ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 370 (ఆదిత్య సుహాస్ జంబాలే)
ఉత్తమ దర్శకత్వం: అమరన్ (రాజ్‌కుమార్ పెరియసామి)
ఉత్తమ సహాయ నటి: మిథ్య (రూపశ్రీ వర్కాడే)
ఉత్తమ సహాయ నటి: సచన నమిదాస్ (మహారాజ)
ఉత్తమ సహాయ నటుడు: సంజయ్ మిశ్రా (భక్షక్)
ఉత్తమ బాలల చిత్రం: చిన్న కథ కాదు (దర్శకుడు-నంద కిషోర్)
ఉత్తమ జాతీయ, విలువల చిత్రం: కెప్టెన్ మిల్లర్ (దర్శకుడు- అరుణ్ మాథేశ్వరన్)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం: కల్కి 2898 ఏడీ (నాగ్ అశ్విన్)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: రణ్‌దీప్ హుడా (స్వాతంత్ర్య వీర్ సావర్కర్)
ఉత్తమ యాక్షన్: మహారాజ (తమిళ్)
ఉత్తమ కొరియోగ్రఫ్రీ: విజయ్ గంగూలీ (ఆజ్ కిరాత్ -స్త్రీ2)
ఉత్తమ గేయరచన: మనోజ్ ముంతాషిర్ (జానేదో-మైదాన్)
ఉత్తమ సంగీతం (నేపథ్యం): జీవీ ప్రకాశ్ కుమార్ (అమరన్)
ఉత్తమ సంగీతం (సాంగ్స్): శశ్వాంత్ సచ్‌దేవ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ మేకప్: పి. రవికుమార్ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: దీపాలి నూర్, సీతల్ శర్మ (పుష్ప2)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ ఎడిటింగ్: ఆర్ కలైవానన్ (అమరన్)
ఉత్తమ సౌండ్ డిజైన్: మానస్ చౌదరి (భూల్ భూలయ్య 3-హిందీ)
ఉత్తమ స్క్రీన్‌ప్లే (సంభాషణలు): వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత (అడాప్టెడ్): యోగేశ్ దేశ్‌పాండే (స్వరగంధర్వ సుదిర్ ఫాడ్కే)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత (ఒరిజినల్): సుకుమార్ (పుష్ప2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: షెహనాద్ జలాల్ (భ్రమయుగం)
ఉత్తమ గాయని: వైకోమ్ విజయలక్ష్మీ (ఏఆర్‌ఎం)
ఉత్తమ గాయకుడు: అభయ్ జోథ్ పూర్కర్ (గరాత్ గణపతి)
ఉత్తమ బాల నటులు: రిద్ధిమాన్ బెనర్జీ, తపోమయ్ దేవ్, గీతాశ్రీ చక్రవర్తి (ఆంకో కి కితిన్ -బెంగాలీ)
ఉత్తమ బాల నటుడు: అరుణ్‌దేవ్ పోతుల (35 - చిన్న కథ కాదు)
ఉత్తమ బాల నటుడు: అతిశ్ శెట్టి
ఉత్తమ తుళు ఫిల్మ్: ఇంబు
ఉత్తమ గర్వాలీ ఫిల్మ్: ధోలి
ఉత్తమ తెలుగు ఫిల్మ్: కమిటీ కుర్రోళ్లు**
ఉత్తమ తమిళ్ ఫిల్మ్: రాయన్
ఉత్తమ ఒడియా ఫిల్మ్: లహరి
ఉత్తమ మరాఠీ ఫిల్మ్: ముక్కమ్ పోస్ట్ బొంబిల్ వాడి
ఉత్తమ మణిపురి ఫిల్మ్: సునిత
ఉత్తమ మలయాళం ఫిల్మ్: ఫెమినిచ్చి ఫాతిమా
ఉత్తమ కొంకణి ఫిల్మ్: మోగ్ ఆసుమ్
ఉత్తమ కన్నడ ఫిల్మ్: మిథియా
ఉత్తమ హిందీ ఫిల్మ్: శ్రీకాంత్
ఉత్తమ గుజరాతీ ఫిల్మ్: మారన్
ఉత్తమ బెంగాలీ ఫిల్మ్: చలిచిత్ర ఎకోన్
ఉత్తమ అస్సామీ ఫిల్మ్: జుయ్‌ఫిల్మ్ (ఆరెంజ్ అండ్ పర్పుల్)
నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ
స్పెషల్ జ్యూరీ: చోలా డోరా ఔర్ సుయ్ (హిందీ); భద్రకాళి నాటకం (మలయాళం)
ఉత్తమ స్క్రిప్ట్: ఓబర్ (హిందీ కశ్మీరీ) ఫరాజ్ అలీ
ఉత్తమ వాయిస్ ఓవర్: లిటిల్ ప్లానెట్: ఏ టేల్ ఆఫ్ ఫ్రాగ్స్ (ఇంగ్లీష్) సుందరాయ జయచంద్రన్
ఉత్తమ మ్యూజిక్ డైరెక్షన్: పరాట్ 41డిగ్రీస్ ఛాయా మగవీర్: శివ్ పాల్‌సింగ్ కాంగ్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్: హమ్‌సఫర్ (మరాఠీ)
ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్: టచ్డ్ ఏజ్ వాటర్
ఉత్తమ సోషల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ వాల్యూస్: పిప్లంత్రి: ఏ టేల్ ఆఫ్ ఎకో ఫెమినిజం
ఉత్తమ డాక్యుమెంటరీ: రామ్-నామి (హిందీ)
ఉత్తమ ఆర్ట్/కల్చర్: మెయిన్ నిదా (హిందీ)
ఉత్తమ హిస్టారికల్ రీకన్‌స్ట్రక్షన్ కాంపిలేషన్ మూవీ: కకోరి (హిందీ)