ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం అర్ధరాత్రి జాతిని ఉద్దేశించి ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశా రు. వైద్య విద్య ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ ప్రశ్న పత్రం లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ.. కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌తో రాజీనామా చేయించాలన్న డిమాండ్ ఊపందుకున్న నేప థ్యంలో ప్రధాన మంత్రి ఈ సెల్ఫీ వీడియో విడుదల చేయడం గమనార్హం. కాగా.. గత 12 సంవత్సరాల ప్రధాని మోడీ పాలనలో ఇలా అర్ధరాత్రి సెల్ఫీవీడియో విడుదల చేయడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. గతంలో రైతులకు సంబంధించిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే క్రమంలో కూడా సెల్ఫీ వీడియో చేసినా.. అది ఉదయం 11 గంటల సమయంలో విడుదల చేశారు.
ప్రధాని మోడీ తాజాగా విడుదల చేసిన సెల్ఫీ వీడియోలోని పూర్తి సందేశం ఇదీ..
మొత్తం 2 నిమిషాల 54 సెకన్ల ఈ సెల్ఫీ వీడియోలో ప్రధాన మంత్రి ఇలా వ్యాఖ్యానించారు. ``స్నేహితులా రా.. పరీక్ష పేపర్ లీక్ విషయం మామూలు సంగతి కాదు. ఇది లక్షలాది మందికి వేదనకు దారితీసిన విష యం. దీనిని మేం తేలికగా తీసుకోలేదు. పేపర్ లీకైన విషయం వెలుగు చూసిన వెంటనే స్పందించాం. గత రెండున్న నెలల కాలంలో కఠిన చర్యలు తీసుకున్నాం. బాధ్యులను అరెస్టు చేసి జైల్లో పడేశాం. మా పని అక్క డితో అయిపోలేదు. విద్యార్థులు పేపర్ లీక్ కారణంగా ఒక ఏడాది కాలాన్ని వృథా చేసుకోకూడ దన్న ప్రధాన బాధ్యతతో వెంటనే నీట్ పరీక్షను మరోసారి అత్యంత పకడ్బందీగా నిర్వహించాం.``
అంతేకాదు.. ప్రధాని మరో కీలక విషయాన్ని కూడా చెప్పారు. ``ఇక్కడితో కూడా మేం ఆగిపోలేదు. పేపర్ లీక్ ఘటన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఎంతగా బాధించిందో నాకు తెలుసు. అందుకే.. ఇకపై పేపర్ లీక్ వంటి ఘటనలు జరగకుండా.. అత్యంత కఠినమైన చట్టానికి రూపకల్పన చేశాం. దీనిపై శుక్రవారం జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో సమగ్రంగా చర్చించనున్నాం. దీనిని సాధ్యమైనంత వేగంగా పార్లమెంటులో ప్రవేశ పెట్టి ఆమోదించుకునేందుకు ప్రయత్నిస్తాం.`` అని పేర్కొన్నారు.
అలాగే.. ``నిందితులను సత్వరమే శిక్షించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశిం చా. మరోవైపు.. కఠినమైన చట్టానికి కూడా రూపకల్పన చేయనున్నాం. పార్లమెంటులో బిల్లును త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకుంటాం.`` అని ప్రధాన మంత్రి వివరించారు. అయితే.. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయాన్ని కానీ.. ప్రభుత్వం క్షమాపణలు చెప్పే విషయాన్ని కానీ.. ప్రధాని ప్రస్తావించకపోవడం గమనార్హం.