భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభించిన మోదీ

admin
Published by Admin — August 01, 2026 in Politics
News Image

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. విమానాశ్రయ రూపకల్పన, చెక్-ఇన్ హాల్, ఇతర విశేషాలను ప్రధాని మోదీకి జీఎమ్మార్ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఎయిర్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను మోదీ ఆసక్తిగా తిలకించారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డు లక్ష్యంగా గిరిజన యువతులు చేసిన థింసా నృత్యాన్ని మోదీ తిలకించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎన్డీఏకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.

Tags
Bhogapuram International Airport pm modi inauraton
Recent Comments
Leave a Comment

Related News