తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన మార్క్ చూపించడానికి రెడీ అయ్యారు. కార్ రేసింగ్ మోజులో పడి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఆయన, ఇప్పుడు ఫుల్ జోష్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఇటీవలే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంతో అలరించిన ఆయన.. ఇప్పుడు అదే డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్‌తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ మూవీకి 'డేర్ డెవిల్(Dare Devil)' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను లాక్ చేస్తూ అఫీషియల్ పోస్టర్‌ను వదిలారు.
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏమిటంటే.. అజిత్ సతీమణి, ఒకప్పటి ప్రముఖ నటి శాలిని(Shalini) ఈ సినిమా ద్వారా గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్నారు. పెళ్లి తర్వాత పూర్తిగా వెండితెరకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె, దాదాపు 26 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. 'బ్రేవ్ హార్ట్స్' పేరుతో కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి, ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆమె స్వయంగా ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం.

పూర్తిస్థాయి కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ట్రెండింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది. మొత్తం మీద 16 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అజిత్(Ajith Kumar) చేస్తున్న ఈ మాస్ ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.