యశ్ `కేజీఎఫ్(KGF)` తర్వాత చేసిన సినిమా అనే క్రేజ్‌తో పాటు, తెలుగులో దిల్ రాజు తీసుకున్న రిలీజ్ రైట్స్ కారణంగా ‘టాక్సిక్’పై అంచనాలు ఆకాశాన్నంటాయి. టాప్ హీరోల సినిమాలకు దీటుగా భారీ స్క్రీన్ కౌంట్‌తో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దించారు. కానీ రిలీజ్ అయిన వెంటనే పరిస్థితి తారుమారైంది. క్రిటిక్స్ నుంచి నెగెటివ్ రివ్యూలు, సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ చుట్టుముట్టడంతో సినిమా భవితవ్యంపై డౌట్లు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఒక్కటే ప్రశ్న మీదకు మళ్లింది. దాదాపు రూ.80 కోట్లు వెచ్చించి రైట్స్ కొన్న దిల్ రాజు(Dil Raju) పరిస్థితి ఏంటి? ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, తొలిరోజు ఓపెనింగ్స్ ఫర్వాలేదనిపించినా, మొత్తంగా చూస్తే ఇన్వెస్ట్‌మెంట్‌లో సగం రికవర్ కావడం కూడా కష్టమేనని చెబుతున్నారు. అంటే సినిమా వ్యాపారపరంగా భారీ నష్టాల్లోకి జారుకున్నట్టేనని లెక్క.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సినిమా ఎంత దారుణంగా ఫెయిలైనా, దిల్ రాజుకు మాత్రం వచ్చే నష్టమేమీ ఉండదని ఇండస్ట్రీ సర్కిల్స్ చెబుతున్నాయి. కారణం తెలుగు రైట్స్ డీల్ కుదిరినప్పుడే ఆయనకు అనుకూలంగా అగ్రిమెంట్ ఖరారైందట. నిర్మాత వెంకట్ కె.నారాయణ(Venkat K Narayana), దిల్ రాజుకు వచ్చే నష్టాన్ని 45 రోజుల్లోగా భర్తీ చేసేలా హామీ ఇచ్చినట్టు సమాచారం.
మరి ఇంత రిస్క్ ఉన్న డీల్‌కు యశ్(Yash) టీమ్ ఎందుకు ఒప్పుకుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. తెలుగు మార్కెట్‌లో బలమైన ముద్ర వేయాలన్న లక్ష్యంతోనే యశ్, నిర్మాత కలిసి దిల్ రాజును ఒప్పించారని తెలుస్తోంది. అందుకు ప్రతిఫలంగా భవిష్యత్తులో ఆయనతో ఒక సినిమా చేస్తానని యశ్ మాట ఇచ్చినట్టు కూడా టాక్ వినిపిస్తోంది. భారీ రిలీజ్, పెంచిన టికెట్ రేట్లతో ఓపెనింగ్ వీకెండ్‌లోనే మ్యాగ్జిమమ్ కలెక్షన్లు లాగేయాలన్న ప్లాన్ కూడా ఇందులో భాగమే.
మొత్తానికి చూస్తే, ‘టాక్సిక్(Toxic)’ బాక్సాఫీస్ వద్ద తేలిపోయినా, బిజినెస్ యాంగిల్‌లో దిల్ రాజుకు మాత్రం పెద్దగా డ్యామేజ్ లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా నష్టాన్ని ఎవరు మోస్తారన్న దానికంటే, ఒప్పందాలు ఎలా కుదుర్చుకుంటే సేఫ్‌గా ఉండొచ్చో చూపించే కేస్ స్టడీగా ఈ డీల్ ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తోంది.