ఆ ఎంపీపై చంద్రబాబు సీరియస్?

admin
Published by Admin — August 31, 2026 in Andhra
News Image

టీడీపీ ఎమ్మెల్యే, ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా మైదుకూరు నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌, ఆయ‌న కుమారుడు.. ర‌వికుమార్‌పై బెంగ‌ళూరు పోలీసులు ఏకంగా అట్రాసిటీ, కిడ్నాప్ స‌హా.. బెదిరింపులు, దాడుల సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. తీవ్ర చ‌ర్చ‌నీయాంశమైన ఈ విష‌యా న్ని సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తున్నార‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. పుట్టా కుమారుడు  మ‌హేష్‌.. ప్ర‌స్తుతం ఏలూరు పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఉన్న విష‌యం తెలిసిందే.

ఏం జ‌రిగింది?

బెంగ‌ళూరుకు చెందిన ఓ డాక్ట‌ర్ కుటుంబంతో క‌లిసి.. పుట్టా కుమారుడు డాక్ట‌ర్ ర‌వి.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపా రం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో లావాదేవీల మ‌ధ్య తేడా కొట్టింది. దీంతో బెంగ‌ళూరుకు చెందిన డాక్ట‌ర్ అనుచ‌రుల‌ను క‌డ‌ప జిల్లాలోని ఎమ్మెల్యే అనుచురులు కొట్టార‌న్న‌ది ఆరోప‌ణ‌. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై తాము కేసు పెట్టినా.. స్థానిక పోలీసులు తీసుకోలేద‌ని ఆరోపిస్తూ.. బెంగ‌ళూరుకు చెందిన డాక్ట‌ర్ కుటుం బం అక్క‌డి స్థానిక కోర్టులో ఎమ్మెల్యే పుట్టా, ఆయ‌న కుమారుడిపై పిటిష‌న్ వేశార‌ని పోలీసులు తెలిపారు.

ఈ వ్య‌వ‌హారం తెలిసిన పుట్టా, ఆయ‌న కుమారుడి అనుచ‌రులు.. ఆదివారం నేరుగా నాలుగు కార్ల‌లో బెంగ ళూరులోని రాజ‌రాజేశ్వ‌రినగ‌ర్‌కు చేరుకుని.. డాక్ట‌ర్ దంప‌తుల‌పై దాడి చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. వారి కారును అడ్డ‌గించ‌డంతోపాటు.. భౌతిక దాడి చేశార‌ని.. డాక్ట‌ర్ స‌తీమ‌ణి స‌హానా వివ‌రించారు. ఈ క్ర‌మంలో త‌న భ‌ర్తను అప‌హ‌రించార‌ని.. ఆయ‌న‌పై తీవ్రంగా దాడి చేసి కొట్టార‌ని కూడా ఆమె ఆరోపించారు. ఈ ప‌రిణామాలతో రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్ పోలీసులు అట్రాసిటీ కేసుతోపాటు కిడ్నాప్ కేసు కూడా న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం.

బాబు సీరియ‌స్‌..

ఈ వ్య‌వ‌హారం ప‌త్రిక‌ల్లో వ‌చ్చేస‌రికి సీఎం చంద్ర‌బాబు ఎమ్మెల్యే తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఉండ‌డం.. క‌డ‌ప జిల్లాను ప్ర‌ధానంగా ల‌క్ష్యం చేసుకున్న నేప‌థ్యంలో ఎమ్మెల్యేపై కేసు న‌మోదు కావ‌డం ప్ర‌తికూల ఫ‌లితాన్ని ఇచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యాన్ని వ్య‌క్తిగ‌తంగా చూసుకోవాల‌ని. పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దీంతో పుట్టా సుధాక‌ర్‌.. వ్య‌వ‌హారం పార్టీలో చ‌ర్చ‌నీయాంశం అయింది.

Tags
putta sudhakar tdp mp putta mahesh case
Recent Comments
Leave a Comment

Related News